మరో రెండు హామీల అమలుపై చంద్రబాబు ప్రకటన - ముహూర్తం..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికే ఉచిత గ్యాస్ అమలు చేస్తున్నారు. 2025-26 బడ్జెట్ లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ కోసం నిధులు కేటాయించారు. అమలు దిశగా కసరత్తు కొనసాగుతోంది. ఇక, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు యువత, మహిళలకు సంబంధించి కీలక అంశాలను ప్రస్తావించారు. త్వరలో అమలు చేయబోయే నిర్ణయాలను వెల్లడించారు.

చంద్రబాబు ప్రకటన

ఈ రోజు (శనివారం) టీడీపీ 43 ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ల పెంపుతో పాటుగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ పైన సంతకం చేసారు. 16,347 డీఎస్సీ పోస్టులు భర్తీకి నిర్ణయం తీసుకున్నారు. పోస్టుల వివరాలు వెల్లడించారు. జనవరిలోనే ఈ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తరువాత విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆ ప్రక్రియ కొలిక్కి రావటంతో మార్గం సుగమం అయింది.

cm-chandra-babu-made-key-announcement-on-dsc-notification-details-here

రెండు పథకాల అమలు

ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు డీఎస్సీ నోటిఫికేషన్ పైన ప్రకటన చేసారు. ఏప్రిల్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే మేలో తల్లికి వందనం పథకం అమలు చేస్తామని ప్రకటించారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ 15 వేల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పుకొచ్చారు. మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేస్తామని వివరించారు. రేపు (ఉగాది) వేళ మరో చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నామని చెప్పారు. పేదరికం లేని సమాజం కోసం పీ4, మార్గదర్శి - బంగారు కుటుంబం తీసుకొస్తున్నామని తెలిపారు. సంపద సృష్టించాలి.. ఆ సంపద పేదలకు చేరాలనేదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరారు.

Take a Poll

కాలగర్భంలో కలిసారు

జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇద్దరు పిల్లలకు తక్కువ కాకుండా కనాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యువతను రాజకీయాల్లోకి తెచ్చిన నేత ఎన్టీఆర్ అని తెలిపారు. పార్టీకి మనమంతా వారసులమని.. పెత్తందారులం కాదన్నారు. తన చుట్టూ తిరిగితే పదవులు రావు.. క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే పదవు ని చెప్పారు. టీడీపీని లేకుండా చేయాలని చాలా మంది చూశారని.. టీడీపీని నాశనం చేయాలను కున్న వారు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. తెలుగువారు ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంద ని చంద్రబాబు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+