ఎస్పీ, జేఈవో పై బదిలీ వేటు - డిఎస్సీని సస్పెండ్ చేసిన చంద్రబాబు..!!

తిరుపతి తొక్కిసలాట ఘటన పైన ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయాలు తీసుకున్నా రు. తిరుపతి ఎస్పీతో పాటుగా టీటీడీ జేఈవో గౌతమి పైన బదిలీ వేటు వేసారు. ఫిర్యాదులు రావటం తో డీఎస్పీ రమణకుమార్ తో పాటుగా గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ను సస్పెండ్ చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా వైకుంఠ ఏకాదశి దర్శనాలు పది రోజుల నిర్వహణ.. తిరుపతిలో టోకెన్లు జారీ చేయటం పైన పునరాలోచన చేయాలని చంద్రబాబు టీటీడీకి సూచించారు. ఘటన పైన న్యాయ విచారణ చేస్తామని ప్రకటించారు.

తిరుపతి ఘటన పైన చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఘటనా స్థలిని పరిశీలించిన చంద్రబాబు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఆ తరువాత మంత్రులు.. అధికారుల తో సమీక్ష చేసారు. బాధితులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఘటనలో బాధ్యతా రాహి త్యం గా వ్యవహరించారనే ఆరోపణలతో తిరుపతి ఎస్సీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమి పైన బదిలీ వేటు వేసారు. అదే విధంగా అనువుగా లేక పోయినా టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసి.. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమయ్యారనే విమర్శలతో డీఎస్పీ రమణ కుమార్ తో పాటుగా గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ను సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

CM Chandra Babu ordered for Transfer of Tirupati SP and Suspends DSP and other officers

తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. అదే విధంగా మరణించిన వారి కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు ఉద్యోగం ఇప్పిస్తా మని చంద్రబాబు హామీ ఇచ్చారు. టీటీడీపై జరిగిన సమీక్షలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. తిరుపతిలో టోకెన్లు ఇవ్వటం పైన ఆగమశాస్త్ర పండితులు ఆలోచన చేయాలని.. బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అదే విధంగా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాల కొనసాగింపు పైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. టోకెన్ల కోసం వచ్చి..గాయపడిన వారికి రేపు దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.

తిరుమల వంటి పుణ్య క్షేత్రంలో అసమర్ధత, అనాలోచిత నిర్ణయాల వల్ల పవిత్రతకు భంగం కలగకూడదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా.. శ్రీవారికి సేవ చేస్తు న్నాం అనే భావన ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. కొందరు అధికారులు వారికి అప్పగించిన టాస్క్ సమర్ధవంతంగా నిర్వహించ లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఈ ఘటన పైన న్యాయ విచారణ నిర్వహించి అన్ని కోణాల్లోనూ విచారణ చేయిస్తామని ప్రకటించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చంద్రబాబు స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+