వరద బాధితులకు ప్రత్యేక ఆర్దిక ప్యాకేజీ - ఎవరికెంత..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనకు సిద్దమవుతున్నారు. వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ పైన కసరత్తు చేస్తున్నారు. బుడమేరు వరదతో విజయవాడ నగరంలోని లక్షలాది మంది భారీగా నష్టపోయారు. ఇప్పటికే ప్రభుత్వం ఇంటంటి సర్వే చేస్తోంది. ఈ నివేదికల ఆధారంగా నష్టపోయిన వారికి ఆర్దికంగా అండగా నిలవనున్నారు. ఇప్పటికే ఎవరికి ఎంత ఇవ్వాలనే అంశం పైన అధ్యయనం మొదలైంది.
నష్టం పై ఆరా
విజయవాడలో వరదలతో భారీగా ప్రాణ - ఆస్తి నష్టం జరిగింది. ప్రస్తుతం తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ముంపు ప్రాంతాల్లో ప్రతీ ఇంటా భారీగా నష్టం జరిగింది. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్దిక సాయం ప్రకటించింది. అదే విధంగా వాహనాలు, వస్తువులకు త్వరగా భీమా వచ్చేలా కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. మరమ్మతుల పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రతీ ఇంటి నుంచి వస్తువులతో సహా ఏం కోల్పోయారనేది వివరంగా సమాచారం సేకరిస్తున్నారు. మొత్తంగా నష్టం ఎంతనేది తేలిన తరువాత పరిహారం పైన నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రభుత్వం కసరత్తు
ఇదే సమయంలో నీట మునిగిన ప్రతీ ఇంటికి రూ 25 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఆర్దికంగా వెసులుబాటు పైన కసరత్తు చేస్తోంది. మొత్తం ఎన్ని ఇళ్లు నీట మునిగాయి..ఏ మేర నష్టం జరిగిందనేది ఆరా తీస్తోంది. ఒక మాదిరిగా మునిగిన ఇళ్లకు రూ. 10 వేల చొప్పున సాయం చేయాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు వాహనాలను సైతం కోల్పోయారు. వారికి అండగా నిలవాలనేది ప్రభుత్వ ఆలోచనగా మంత్రులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారం సైతం సేకరిస్తున్నారు.
స్పెషల్ ప్యాకేజీ
వరద నీట మునిగిన ఆటోలకు, ట్యాక్సీలకు రూ. 10 వేలు.. అలాగే మోటర్ సైకిళ్ల మరమ్మతుకు రూ.3 వేలు ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ వర్షాలు, వరదలతో నష్టపోయిన పంటలకు.. గతంలో ఇస్తున్న పరిహారాన్ని మరింత పెంచి రైతులకు ఇవ్వాలనే ప్రతిపాదనల పైన కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వం ఆర్థిక వెసులుబాటును పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం వరద నష్టం..సాయం పైన మంత్రుల కమిటీ నియమించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ప్యాకేజీని అధికారికంగా ఖరారు చేయనుంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications