ఏపీకి రావాల్సినవవే వచ్చాయి - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవవే వచ్చాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏదో ఇచ్చారన్నట్టు కొందరు రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రధాని అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. గడిచిన ఐదేళ్లలో విభజన కంటే ఎక్కువ అధ్వాన్నమైన పరిస్థితికి ఏపీ పడిపోయిందని అన్నారు. తలసరి ఆదాయం పడిపోయిందని చెప్పారు.

నీతి అయోగ్ భేటీలో
నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు రాష్ట్రానికి కావాల్సిన అంశాలను ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నవే ఇచ్చారని తెలిపారు. అమరావతి పోలవరం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి అన్ని విభజన చట్టంలో ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ప్రత్యేక హోదా బదులు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌కి సహాయం చేస్తామని చెప్పారని గుర్తుచేశారు. విభజన సమయంలో ఆంధ్ర తెలంగాణకు తలసరి ఆదాయం రూ. 30 వేల తేడా ఉందని తెలిపారు.

CM chandra Babu reacts over allocations for AP latest central Budget

ఏపీకి రావాల్సినవే
గడిచిన ఐదేళ్లలో విభజన కంటే ఎక్కువ అధ్వాన్నమైన పరిస్థితికి ఏపీ పడిపోయిందని అన్నారు. తలసరి ఆదాయం పడిపోయిందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లించారని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలకు సమాధానం చెప్పాలని చంద్రబాబు ఢిల్లీ వేదికగా డిమాండ్ చేసారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవవే వచ్చాయన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏదో ఇచ్చారన్నట్టు కొందరు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. చట్టం రూపకల్పన చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేసారు.

పోలవరంకు నిధులు
విభజన కంటే గడిచిన ఐదేళ్లలో రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ పథకాల్లో గత ఐదేళ్లలో రాష్ట్రం చాలా రాష్ట్రాల కంటే వెనుకబడిందని వివరించారు. ఏ మంత్రిత్వ శాఖ దగ్గరకు వెళ్లిన రాష్ట్రం వెనుకబడిన గణాంకాలే చూపిస్తున్నారన్నారు. పోలవరం, అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రం వాల్ నిర్మించడానికి ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు మొదటి దశకు అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం వెంటనే ఆమోదించేలా చూడాలని చంద్రబాబు కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+