కేంద్రం ఇస్తోంది రూ 15 వేల కోట్లు రుణమే, కానీ - చంద్రబాబు..!!
కేంద్ర బడ్జెట్ లో ఏపీకి కేంద్ర కేటాయింపుల పై స్పష్టత వచ్చింది. అమరావతికి కేంద్రం రూ 15 వేల కోట్లు కేటాయించినట్లు ప్రచారం సాగింది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని రుణంగా సర్దుబాటు చేస్తామని పేర్కొంది. ఆ తరువాత కేంద్ర మంత్రి ఈ అంశం పైన స్పష్టత ఇచ్చారు. విదేశీ విత్త సంస్థల నుండి 15 వేల కోట్ల రూపాయలను సర్దుబాటు చేస్తామని, అవసరమైతే మరింతగా అదనపు నిధులకు సహకరిస్తామని పేర్కొన్నారు.
ఏపీకి రూ 15 వేల కోట్ల రుణం
ఏపీకి కేంద్రం తోడ్పాటు పైన నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని బడ్జెట్ ప్రతిపాదనల్లో పేర్కొన్న కేంద్ర మంత్రి దాని అమలులో భాగంగా అమరావతికి విదేశీ సంస్థల నుంచి రూ 15 వేల కోట్లు ఈ ఏడాది సర్దుబాటు చేస్తామని వెల్లడించారు. ప్రపంచబ్యాంకు నుండి ఆ మొత్తాన్ని ఇప్పిస్తామని ఒక ప్రశ్నకు జవాబుగా చెప్పారు. మ్యాచింగ్ గ్రాంటు మొత్తం ఏదైనా ఉంటే దానిని సర్దుబాటు చేస్తామన్నారు. ఇక విభజన చట్టంలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అంశాన్ని కూడా బడ్జెట్‌లో ప్రస్తావించినప్పటికీ, ఎంత నిధులు కేటాయిస్తారన్న విషయం చెప్పలేదు.

పోలవరం పూర్తి చేస్తాం
పోలవరం పూర్తికావడానికి అవసరమైన ఆర్థికసాయం చేస్తామని మాత్రమే పేర్కొన్నారు. ఇక నిర్వాసితులు, పునరావాసం తదితర అంశాలనే ప్రస్తావించలేదు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా విశాఖ పట్నం-చెన్పై ఇండిస్టియల్ కారిడారలో కొప్పర్తి వద్ద, హైదరాబాద్ -బెంగళూరు ఇండిస్టియల్ కారిడార్‌లో ఓర్వకల్లు వద్ద మౌలికవసతులు ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. వెనుకబడిన రాయలసీమ, ప్రకాశం. ఉత్తరాంధ్ర జిల్లాలకు గ్రాంట్లు విడుదల చేస్తామని ప్రకటించారు.
ఏ రూపంలో వచ్చినా
ఇదే అంశం పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. నిధులు ఏ రూపంలో వచ్చినా మేలేనని వ్యాఖ్యానించారు. కేంద్రం పూచీ కత్తుతో అమరావతికి రుణం వస్తుందని..కొంత మేర గ్రాంట్ గా ఉండే అవకాశం ఉంటుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజధానికి నిధులు ఇవ్వటం వల్ల ఆర్దిక కార్యక్రమాలు పెరుతాయన్నారు. 30 ఏళ్ల వరకు రుణం తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు. ఆ రుణాలకు కూడా కేంద్రమే హామీ ఇస్తుందని చెప్పారు. వెనుకబడిన జిల్లాల కోసం ప్యాకేజీ అమలు ప్రకటనను చంద్రబాబు స్వాగతించారు.












Click it and Unblock the Notifications