సచివాలయాలపై చంద్రబాబు కీలక నిర్ణయం, ఇక నుంచి..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ వ్యవస్థలో మార్పులు తెచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో వార్డు - గ్రామ సచివాలయాల ద్వారా సేవల అంశం పైన చర్చ జరిగింది. ఆ సమయంలో వాట్సప్ గవర్నెన్స్ వినియోగం పైన సచివాలయాల ద్వారా సంబంధిత వార్డుల్లోని వారికి అవగాహన పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అదే సమయంలో సచివాలయాలకు సంబంధించి కీలక ప్రకటన చేసారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయాల పేరు మార్పు పైన స్పష్టత ఇచ్చారు. రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో భాగంగా సచివాలయ వ్యవస్థ పైన చర్చకు వచ్చింది. ఆ సందర్భంలో సీఎం సచివాలయాల శాఖ పేరు మార్చుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇక నుంచి స్వర్ణగ్రామం శాఖగా మార్చాలని నిర్ణయించారు. సచివాలయాల పేర్లను సైతం మార్పు చేయనున్నారు. గ్రామ సచివాలయాల పేరును 'విజన్ యూనిట్స్'గా మారుస్తున్నట్లుగా గతంలోనే ప్రకటించారు.

ఇక నుంచి ఈ యూనిట్లు ప్రజలకు సేవలు సమర్థవంతంగా అందించే కేంద్రాలుగా రూపొందుతాయని వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 13,326 గ్రామ, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఈ మార్పు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా వచ్చిన 'స్వర్ణాంధ్ర విజన్ 2047'కు అనుగుణంగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
సీఎం చంద్రబాబు గ్రామ సచివాలయాలను మరింత ఎఫెక్టివ్‌గా మార్చాల్సి ఉందని.. చంద్రబాబు భావిస్తున్నారు. ఇక నుంచి వీటిని 'విజన్ యూనిట్స్'గా పిలుస్తామని.. ఇవి ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా మాత్రమే కాకుండా, గ్రామీణ వికాసానికి విజనరీ ప్లాన్‌లు రూపొందించే యూనిట్లుగా పనిచేయాలని సూచించారు.
కాగా, కలెక్టర్ల సదస్సులోనూ సచివాలయాల నుంచి అందుతున్న సేవలు.. రియల్ టైం మానిటరింగ్ పైన కొన్ని సూచనలు చేసారు. వాలంటీర్ల వ్యవస్థ లేకపోవటంతో ఇప్పుడు పంపిణీ వ్యవస్థ సైతం సచివాలయ ఉద్యోగులే నిర్వహిస్తున్నారు. ప్రతీ నెలా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం సచివాలయాల ఉద్యోగుల సర్దుబాటు.. విధుల విషయంలోనూ నిర్ణయాలు తీసుకుంది. ఇప్పడు పేరు మార్పు పైన సీఎం చంద్రబాబు అధికారికంగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications