క్షమించలేని తప్పు, వారిని ఫిక్స్ చేయండి- చంద్రబాబు ఫైర్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై మండిపడ్డారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన స్థలాన్ని చంద్రబాబు పరిశీలించారు. అక్కడ ఏర్పాట్ల గురించి ఆరా తీసారు. రెవిన్యూ, పోలీసు, టీటీడీ మధ్య సమన్వయం ఎందుకు లేదని ప్రశ్నించారు. 2000 మంది సరిపోయే చోట 2500 మందిని ఎందుకు అనుమతించారని నిలదీసారు. తమాషా చేస్తున్నారా అంటూ మండిపడ్డారు. బాధ్యులైన అధికారులను ఫిక్స్ చేయాలని ఆదేశించారు. ఘటన జరిగిన తరువాత స్పందించిన తీరు పైన చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

చంద్రబాబు పరిశీలన
తిరుపతిలో ప్రమాద స్థలాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. తొక్కిసలాట ఘటన గురించి టీటీడీ అధికారులు వివరించారు. ఘటన పైన ముందస్తుగానే సమాచారం సేకరించిన చంద్ర బాబు ప్రమాదం జరిగిన కౌంటర్ వద్ద ఉన్న ఏర్పాట్ల పై ప్రశ్నించారు. టీటీడీ ఈవో, కలెక్టర్ చెప్పిన సమాధానంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. టికెట్ కౌంటర్ల నిర్వహణ పై జేఈఓ గౌతమి నుంచి చంద్రబాబు ఆరా తీసారు. ముందస్తుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. విధులు కేటాయించిన పోలీసు అధికారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారని అడిగారు. ఇది క్షమించాల్సిన తప్పు కాదన్నారు.

CM Chandra Babu seek report from TTD over Tirupati stampede serious on officers

అధికారుల పై ఆగ్రహం
టికెట్లు పంపిణీ కేంద్రంలో తొక్కిసలాటల నియంత్రణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్ నారని అధికారులను ప్రశ్నించారు. ఇంతమంది అధికార యంత్రాంగం ఉండి టికెట్ల పంపిణీ ఎందుకు సవ్యంగా చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో ఎన్ని టికెట్లు జారీ చేశారు... ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందంటూ వరుసగా సీఎం ప్రశ్నలు సంధించారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని.. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని హెచ్చరించారు.

చర్యలకు సిద్దం
భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అంబులెన్స్‌ల లభ్యత గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. బాధ్యత తీసుకున్నవారు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. పరిమితికి మించి భక్తులను లోపలికి ఎందుకు పంపించారని అడిగారు. భక్తులను బయటకు వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. అక్కడి నుంచి స్విమ్స్ కు వెళ్లిన చంద్రబాబు గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తున్నారు. ఘటన కు బాధ్యులైన వారి పైన కఠిన చర్యల దిశగా చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+