పిఠాపురం పరిణామాలపై చంద్రబాబు అసంతృప్తి, కీలక ఆదేశాలు..!!

పిఠాపురం కేంద్రంగా రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వర్మ తో జనసన నేతల తీరు పైన వివాదం కొనసాగుతోంది. వర్మ వర్సస్ జనసేన అన్నట్లుగా నియోజక వర్గంలో పరిస్థితి మారుతోంది. తాజాగా ఫ్లెక్సీ విషయంలో మొదలైన వివాదం.. ఘర్షణ వరకు దారి తీసింది. ఈ విషయం సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. పిఠాపురంలో పరిస్థితి పైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. వర్మ తీరు పైన ఆగ్రహం వ్యక్తి చేసినట్లు తెలుస్తోంది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కొత్త వివాదం మొదలైంది. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వర్మ.. జనసేన నేతల మధ్య తాజాగా చేసుకున్న ప్రొటోకాల్ వివాదం కొత్త ములుపు తీసుకుంది. వివాదం వేళ వర్మ చేసిన వ్యాఖ్యల పై జనసేన నేతలు ఆగ్రహంతో ఉన్నారు. తాము దత్తత వచ్చిన నేతలం కాదని.. పిఠాపురంలోనే పుట్టి.. పెరికామంటూ వర్మ చేసిన వ్యాఖ్యల పైన ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇదే సమయంలో ఈ వ్యవహారం పైన సీఎం చంద్రబాబు ఆరా తీసారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడిన సీఎం చంద్రబాబు అక్కడి పరిస్థితు పైన పూర్తి సమాచారం సేకరించారు. పిఠాపురం ప్రొటోకాల్ వివాదం పై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహార శైలిని సీఎం తప్పు బట్టారు.

cm-chandra-babu-seek-report-over-varma-janasena-leaders-disputes-in-pithaputam-constituency

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి చంద్రబాబు కీలక సూచనలు

ఈ ఘటన పైన పల్లా శ్రీనివాస్ లో మాట్లాడిన సిఎం కీలక వ్యాఖ్యలు చేసారు. ఐక్యంగా ఉండి ఆదర్శంగా నిలవాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో, ఫ్లెక్సీలపై ఫోటోల పేరుతో ఘర్షణ పడడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. ఏదైనా పొరపాటు, తప్పు జరిగినా పార్టీ పెద్దలకు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కానీ...ఇలా గొడవ పడడం వల్ల లాభం ఉండదన్న సిఎం పేర్కొన్నారు. అదే సమయంలో ఇలాంటి చర్యలు క్యాడర్ కు తప్పుడు సంకేతాలు పంపుతాయని...ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పల్లాకు సూచన చేసారు. ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు తగు సూచనలుచేయాలని సిఎం పల్లాను సిఎం ఆదేశించారు. దీంతో.. ఇప్పుడు వర్మ తో పల్లా మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. అటు జనసేన నాయకత్వం సైతం పిఠాపురం వ్యవహారం పైన ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని సూచించినట్లు సమాచారం. ఇప్పుడు వర్మ పైన సీఎం అసహనం వ్యక్తం చేయటంతో.. వర్మ స్పందన ఏంటనేది కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+