చింతమనేనిపై చంద్రబాబు సీరియస్ - రాజీనామాకు సిద్దం...!!
ఏపీలో రాజకీయాలు మరో సారి వేడెక్కుతున్నాయి. ఇటు వల్లభనేని వంశీ అరెస్ట్ సమయంలోనే అటు దెందు లూరు నియోజకవర్గం లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేత చింతమనేని...వైసీసీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మధ్య రాజకీయ పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఈ సమయంలో చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వ్యవహారం పైన సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే చింతమనేని పై సీరియస్ అయ్యారు. అధికారంలో ఉన్నామని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ఇదే సమయంలో చింతమనేని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.
చంద్రబాబు సీరియస్
దెందులూరులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు వివాదాస్పదంగా మారాయి. ఒక వివాహ వేడుకకు హాజరైన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అక్కడ కారు అడ్డంగా ఉంచటం పైన అబ్బయ్య చౌదరి కారు డ్రైవరు పైన దుర్భాషలాడారు. చింతమనేని చేసిన అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడి యాలో వైరల్ అయ్యాయి. దీంతో, అబ్బయ్య చౌదరి మద్దతుదారులు ఎమ్మెల్యే చింతమనేనిని వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ ఘటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ కార్యాలయంలో సీఎం చంద్రబాబును చింతమనేని కలిసారు. తాజా ఘటన పైన చింతమనేని వివరణ ఇచ్చారు.

రాజీనామాకు సిద్దం
చింతమనేని వివరణ విన్న చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. తప్పును తప్పని చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కేవలం బూతులు ఒక్కటే మార్గం కాదని, తీరు మార్చు కోవాలని చంద్రబాబు హెచ్చరించారు. ఇదే సమయంలో చింతమనేని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. దెందు లూరు ఘర్షణలో తన తప్పు ఉందని రుజువైతే రాజీనామాకు సిద్ధమని ప్రనకటించారు. తర గురించి గంటా అరగంటా అంటూ మాట్లాడే అంబటి సర్టిఫికెట్ ఇస్తాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. సుకన్య, సంజనల సర్దిఫికెట్ పొందిన అంబటి స్థాయి అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. నోరు ఉంది కదా అని ఆంబోతులా రంకెలు వేయటం ఇకనైనా మానుకో వాలని సూచించారు.
కేసు పెడతాను
ఇలా రంకలేస్తేనే ప్రజలు కాల్చి పెట్టిన వాతలు చూపించుకోలేని దుస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారని మండి పడ్డారు. ఉద్దేశపూర్వకంగా తనతో గొడవ పెట్టుకుందాం అని అబ్బయ్య చౌదరి ట్రాప్‌లో తాను పడలేదని చెప్పుకొచ్చారు. పోలవరం కాల్వ బాధితులకు చెల్లించాల్సిన రూ.6కోట్లు ఎగ్గొట్టే కుట్రలో భాగంగానే తనతో గొడవకు ట్రాప్ పన్నారని చింతమనేని వ్యాఖ్యానించారు. కోడెల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన చావుకు కారణమైన వారి చర్యలకు నేను కేసు పెడతానని చింతమనేని వెల్లడించారు. కోడెల శివప్రసాదరావు చనిపోవటానికి కార ణమైన అంబటి రాంబాబు, జగన్‌లపై ఇప్పుడైనా 306 సెక్షన్ కింద కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications