ఢిల్లీకి సీఎం చంద్రబాబు - 'ఆపరేషన్ వైసీపీ', నెక్స్ట్ వికెట్..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం పూర్తవుతోంది. అటు టీడీపీ మహానాడు వేడుకకు సిద్దం అవుతోంది. ఈ సమయంలో నే సీఎం చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ సారి పర్యటన అధికారికంగా - రాజకీయంగా కీలకంగా మారుతోంది. వైసీపీ పైన గురి పెట్టిన కూటమి నేతలు.. ఇప్పుడు కొత్త వ్యూహా లు అమలు చేస్తున్నాయి. ఈ నెలాఖరులో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకొనే ఛాన్స్ ఉంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు 22వ తేదీ ఢిల్లీకి వెళ్లనున్నారు. 23వ తేదీ కేంద్ర మంత్రులతో సిఎం సమావేశాలు ఖరారయ్యాయి. ఆర్దిక, ఇరిగేషన్, హోం, జాతీయ రహదారుల శాఖల మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆ మరుసటి రోజు 24వ తేదీ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ లో పాల్గొననున్న చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తావన చేయను న్నారు. ఇప్పటికే నీతి అయోగ్ సభ్యులకు ఏపీలో తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. అదే విధంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న ఈ గవర్నెర్స్ గురించి ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ పర్యటనలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

cm-chandra-babu-to-attend-neeti-ayog-meeting-in-his-three-days-delhi-tour

పార్టీ మహానాడు సమయంలో కడపతో పాటుగా ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ ముఖ్యులు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని పార్టీ నేతల సమాచారం. కాగా, ఒక రాజ్యసభ సభ్యుడు సైతం కూటమి పార్టీలతో టచ్ లోకి వెళ్లినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఆ సభ్యుడు తనకు తిరిగి టీడీపీ నుంచి పెద్దల సభకు అవకాశం ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానంటూ సంకేతాలు ఇస్తున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటుగా.. లిక్కర్ కేసు విచారణ.. జగన్ ప్రమేయం పైన ఇప్పటి వరకు లభించిన ఆధారాల గురించి వివరించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక, మహానాడు తరువాత ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని ప్రచారం సాగుతున్న వేళ చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+