శ్రీవారి భక్తులకు తీరనున్న గదుల కష్టాలు - ఇక నుంచి ఇలా..!!

Tirumala: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల వేళ సిఫారసు లేఖలను రద్దు చేసారు. గరుడ వాహనం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. దీంతో, ఘాట్ రోడ్ లో ద్విచక్ర వాహనాల పైన ఆంక్షలు విధించారు. ఇక.. తిరుమలలో వసతి సమస్యల పరిష్కారం దిశగా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్తగా వసతి సముదాయం భక్తులకు అందుబాటులోకి రానుంది. గదుల కేటాయింపులోనూ మార్పులు చేస్తోంది.

తిరుమలలో భక్తుల వసతి సమస్యల పరిష్కారానికి టీటీడీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కొత్తగా వసతి సముదాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. తిరుమలలో నూతనంగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం-5 భవనాన్ని బ్రహ్మోత్సవాల వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

CM Chandra Babu to inaugurate PAC-5 in Tirumala during Brahmotsavams

ఈ సముదాయంలో పెద్ద సంఖ్యలో భక్తులకు వసతితో పాటుగా అన్ని సౌకర్యాలు ఒకే చోట కల్పించారు. దాదాపు 2500 మందికి సరిపడే విధంగా ఈ భవనంలో ఏర్పాట్లు చేసారు. ఈ కొత్త సముదాయంలో హాళ్లు, కళ్యాణ కట్ట, మరుగుదొడ్లు, అన్న ప్రసాద వితరణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు అద్భుతంగా ఈ సముదాయాన్ని నిర్మించారని తాజాగా టీటీడీ ఛైర్మన్ నాయుడు అభినందించారు.

2018లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బోర్డు ఆమోదం తెలిపిన ఈ ప్రాజెక్టు ద్వారా తిరుమలలో యాత్రికుల వసతి సమస్యకు కొంత మేర ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ప్రస్తుతం తిరుమలలో 45 వేలమందికి మాత్రమే వసతి సౌకర్యాలు ఉన్నాయని, కొత్తగా నిర్మించిన పీఏసీ - 5లో 2,500 మంది యాత్రికులు సులభంగా వసతి పొందగలరని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

CM Chandra Babu to inaugurate PAC-5 in Tirumala during Brahmotsavams

రానున్న బ్రహ్మౌత్సవాల సమయంలో ఈ సముదాయాన్ని యాత్రికులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. 2,500 మందికి వసతి సౌకర్యం కల్పించినప్పటికీ, అవసరమైతే మరో 1,000 మంది యాత్రికులను కూడా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని వివరించారు. చంటి పిల్లల తల్లుల కోసం ప్రత్యేకంగా మిల్క్‌ ఫీడింగ్‌ గది ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకేసారి 1,400 మంది అన్నప్రసాదాలు స్వీకరించే విధంగా విస్తఅతమైన అన్నప్రసాదాల హాలును ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+