కీలక పరిణామాల వేళ ఢిల్లీకి సీఎం చంద్రబాబు..!!
ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్ లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమైంది. ప్రస్తుత సీఎం నితీశ్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసారు. బీజేపీ నేత కొత్త సీఎం గా బాధ్యతలు చేపట్టనున్నారు. మరో వైపు పలు రాష్ట్రాల గవర్నర్లను మార్పు చేసారు. కాగా, అయిదు రాష్ట్రాల ఎన్నికలకు బీజేపీ అధినాయకత్వం సమాయత్తం అవుతోంది. కేంద్రం - పార్టీ లో భారీ ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది.
కేంద్రలోని బీజేపీ నాయకత్వం రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాన భాగస్వామి గా ఉన్న నితీశ్ ను రాజ్యసభకు పంపుతోంది. ఆయన కుమారుడిని బీహార్ లో డిప్యూటీ సీఎం చేస్తూ ఆ రాష్ట్రంలో తమ పార్టీ నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయటానికి రంగం సిద్దమైంది. నితీశ్ ను రాజ్యసభ కు పరిమితం చేస్తారా.. కేంద్ర మంత్రి వర్గంలో అవకాశం కల్పిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

ఇదే సమయంలో కీలక రాష్ట్రాల గవర్నర్లను మార్పు చేసారు. తమిళనాడు గవర్నర్ ను బెంగాల్ పంపారు. తెలంగాణ గవర్నర్ ను మార్చారు. త్వరలో అయిదు రాష్ట్రాల కు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో కేంద్ర మంత్రివర్గంతో పాటుగా.. బీజేపీ జాతీయ నాయకత్వంలోనూ మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రులు గా ఉన్న పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు.
ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు
అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల నేతలకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్క నుంది. కాగా.. కేంద్ర మంత్రివర్గ విస్తరణ.. బీజేపీ అధినాయకత్వం నిర్ణయాలతో ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న కీలక పరిణామాల వేళ ఏపీ సీఎం చంద్రబాబు హస్తినకు వెళ్తున్నారు. రేపు (శనివారం) ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు ప్రగతి మైదాన్ , భారత్ మండపం లో జరిగే రైసినా డైలాగ్ - 2026 లో రేపు మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు పాల్గొననున్నారు. తిరిగి రాత్రి 7 గంటలకు అమరావతి చేరుకోనున్నారు.
అయితే, కేంద్ర మంత్రులతోనూ కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ పైన చర్చ జరుగుతున్న వేళ.. ఏపీకి మరో బెర్తు దక్కనున్నట్లు సమాచారం. టీడీపీ, జనసేన నుంచి ఎవరికి ఈ అవకాశం దక్కనుందనేది సీఎం చంద్రబాబు - పవన్ డిసైడ్ చేయాల్సి ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా కేంద్రంలో కొత్తగా మంత్రి ఎవరనేది నిర్ణయించనున్నారు. రెండో విడత పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేయాలని బీజేపీ నాయకత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications