కుప్పంలో కామిడీలు చేస్తున్న అధికారులు, సీఎం చెవిలో వేసిన టీడీపీ

తన సొంత నియోజక వర్గం కుప్పంలో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తున్న అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారని తెలిసింది. కుప్పం గ్రామీణ అభివృద్దీకరణ (రెస్కో) అక్రమాలపై నమోదైన కేసులు అధికారులు తూతూ మంత్రంగా దర్యాప్తు చేస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.

తన సొంత నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై మీరు ఇలాగేనా దర్యాప్తు చేసేది అంటూ సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించాలని తెలిసింది. కుప్పం రెస్కో అక్రమాలపై అనేక ఆరోపణలు రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు విచారణ జరిపించడానికి ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. విచారణ అధికారిగా శ్రీలక్ష్మిని నియమించారు. గత వైసీపీ ప్రభుత్వంలో కుప్పం రెస్కో లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేసి పూర్తి వేదిక సమర్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu came to know about Kuppam RESCO irregularities

సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండు వారాలలో కుప్పం రెస్కో పై విచారణకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్ కుమార్ పై కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ రెండవ తేదీన తమిళనాడులో దాక్కున్న రెస్కో మాజీ చైర్మన్ సెంథిల్ కుమార్ ను కుప్పం పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత చిత్తూరు జిల్లాకు పిలుచుకుని వచ్చి కోర్టు ముందు హాజరుపరిచి తరువాత ఆయన్ను రిమాండ్ కు తరలించారు.

గత వైసీపీ పాలనలో రెస్కో లో అక్రమ మార్గంలో ఉద్యోగాలు కల్పించారని, చాలామంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేశారని, రెస్కో నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారాలపై శ్రీ లక్ష్మీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసిన సీఎం చంద్రబాబు నాయుడు దర్యాప్తుకు ఆదేశించారు. ఇప్పటికే రెండుసార్లు విచారణ చేపట్టిన శ్రీలక్ష్మి రెస్కో ఉద్యోగులతో పాటు పలువురిని విచారణ చేసి వారి నుండి స్టేట్ మెంట్లు తీసుకున్నారు.

CM Chandrababu came to know about Kuppam RESCO irregularities

రెస్కో అక్రమాలపై సమగ్ర విచారణ పూర్తి కాకపోవడంతో స్థానిక టీడీపీ నాయకులు ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి ఆయన దృష్టికి ఈ సమాచారం చెప్పారు. ఈ వివరాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు రెస్కో స్కాంపై దర్యాప్తు చేస్తున్న అధికారులపై మండిపడ్డారని సమాచారం. ఉద్యోగాలు చెయ్యకపోయినా అనేక మందికి ఐదు సంవత్సరాలు జీతాలు ఇచ్చారని, 112 మందికిఉద్యోగాు ఇచ్చి వారి నుంచి లక్షలు లక్షలు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+