కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు

జీఎస్టీలో కేంద్ర ప్రభుత్వం భారీ సంస్కరణలను చేపట్టింది. రీవ్యాంప్ చేసింది. ఫలితంగా స్లాబ్‌లు భారీగా తగ్గాయి. ఇదివరకు ఉన్న శ్లాబ్ ల వ్యవస్థ తొలగిపోయాయి. రెండు శ్లాబ్స్ మాత్రమే మిగిలియి. 5, 18 శాతం శ్లాబులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త విధానం ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. న్యూఢిల్లీలో జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ జీఎస్టీ శ్లాబ్ లను ప్రకటించారు.

మెజారిటీ వస్తువులు 5, 18 శాతం శ్లాబ్‌లలోకి రావడం, అనేక వస్తువులు జీరో శాతం పన్ను పరిధిలోకి రావడం వల్ల సామాన్య ప్రజలకు భారీగా ఊరట ఇచ్చినట్టయింది. కొత్త శ్లాబ్ సిస్టమ్ వల్ల ప్రజల వద్ద డబ్బు ఆదా అవుతుందని, అది తిరిగి మరో రూపంలో ఆర్థిక వ్యవస్థలోకి చేరుతుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ఖాజానాకు రూ. 48,000 కోట్ల రెవెన్యూ ఇంప్లికేషన్ ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తోన్నారు.

CM Chandrababu hailed the GST reforms

ఈ సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. జీఎస్టీ శ్లాబ్ ల సవరణను స్వాగతిస్తున్నామని ప్రకటించారు. కొత్త సిస్టమ్ వల్ల నిత్యావసరాలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలకు ఎంతగానో ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. ఇది పేదల అనుకూలమైన, వృద్ధి-ఆధారిత నిర్ణయంగా అభివర్ణించారు. తద్వారా రైతుల నుండి వ్యాపారుల వరకు సమాజంలోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.

ఈ విప్లవాత్మక చర్యను చేపట్టినందుకు చంద్రబాబు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు అభినందనలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ ప్రకటించిన విధంగా.. ఈ కొత్త జీఎస్టీ సంస్కరణలు పన్నుల విధానంలో ఒక వ్యూహాత్మక, పౌర-కేంద్రీకృత పురోగతిని సూచిస్తాయని అన్నారు. ఈ సంస్కరణల ద్వారా ప్రతి భారతీయుడికి మెరుగైన జీవన ప్రమాణాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఈ నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. పేదల ప్రయోజనాలకు అనుగుణంగా తీసుకున్న చర్యగా అభివర్ణించారు. ఆహారం, విద్య, ఆరోగ్యం, ఉక్కు, సిమెంట్, వస్త్రాలు వంటి కీలక రంగాలను ఇవి కవర్ చేస్తాయని పయ్యావుల అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+