75ఏళ్ళ వయసులో కూడా... ఆ విషయంలో సీఎం చంద్రబాబు అందరికీ రోల్ మోడల్
ప్రతి ఒక్కరూ రోజు గంటపాటు యోగా చేస్తూ ఆరోగ్యపరమైన జీవితం అలవర్చుకోవాలని, ఆ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అందరికీ రోల్ మోడల్ గా నిలుస్తారని ఏపీ బీసీ ఈడబ్ల్యూఎస్, సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. ఎన్ని పనులు ఉన్నా సరే 70 ఏళ్ల వయసులో కూడా సీఎం చంద్రబాబు ప్రతిరోజు యోగా చేస్తారని సవిత వెల్లడించారు.
సీఎం చంద్రబాబు విజయ రహస్యం ఇదే
యోగాతో శారీరక, మానసిక దృఢత్వం సాధిస్తామని, తద్వారా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాము అని, సీఎం చంద్రబాబు విజయ రహస్యం ఇదేనని ఆమె పేర్కొన్నారు. యోగాంధ్ర 2025 మాస ఉత్సవాలలో భాగంగా పెనుగొండ లోని కియా పరిశ్రమ వద్ద నేడు ఏర్పాటు చేసిన యోగాసనాల కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సవిత ప్రాచీన భారతదేశం అందించిన అమూల్యమైన బహుమతి యోగా అని పేర్కొన్నారు.

ఈ వయసులో కూడా చంద్రబాబు ఒక యువకుడిలా
యోగాసనాలతో శారీరక మానసిక దృఢత్వం సాధిస్తామని తెలిపారు. ప్రస్తుత సమాజంలో తీవ్ర ఒత్తిడి మధ్య జీవనం సాగిస్తున్నామని పేర్కొన్న ఆమె, ఇటువంటి సమయంలోనే మానసికంగా దృఢంగా ఉండాలంటే యోగా చేయాలని అప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోగలమని తెలిపారు. యోగాతో చంద్రబాబు ఈ వయసులో కూడా ఒక యువకుడిలా రాష్ట్ర అభివృద్ధి కోసం రేయింబవళ్లు కృషి చేయగలుగుతున్నారు అన్నారు.
చంద్రబాబు అందరికీ రోల్ మోడల్
ఆరోగ్యవంతంగా, ఏకాగ్రతతో, విజనరీ తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబును అందరూ రోల్ మోడల్ గా తీసుకోవాలని సూచించారు. ఈనెల 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం విశాఖలో నిర్వహించడానికి సీఎం చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నారని మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మందితో యోగ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఐదు లక్షల మందితో యోగా డే, పాల్గొననున్న మోదీ
విశాఖలోని ఆర్ కే బీచ్ వద్ద ఐదు లక్షల మందితో యోగా నిర్వహించబోతున్నామని, ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సీఎం చంద్రబాబు పలువురు మంత్రులు అధికారులు పాల్గొనబోతున్నారని మంత్రి సవిత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications