ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి
రాబోయే రోజుల్లో మహిళలు ఎమ్మెల్యేలుగా చట్టసభల్లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతిలోని పరేడ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. మహిళా సాధికారత, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అభివృద్ధిపై కీలక ప్రసంగం చేశారు. సృష్టికి మూలమైన మహిళలను పూజించిన చోట సంపదకు లోటు ఉండదని పేర్కొన్నారు
మహిళలకు రాబోయే రోజుల్లో చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలులోకి రాబోతున్నాయని, ఇదొక గొప్ప అవకాశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆయన ఆకాంక్షించారు. గతంలో ఎన్టీఆర్ హయాంలోనే ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేస్తూ, తన ప్రభుత్వంలో కూడా ముగ్గురు మహిళా మంత్రులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. దేశానికి గిరిజన మహిళ రాష్ట్రపతిగా ఉండటం, నిర్మలా సీతారామన్ వంటి వారు ఆర్థిక మంత్రిగా రాణించడం మహిళా శక్తికి నిదర్శనమని తెలిపారు. ఏపీ హైకోర్టుకు కూడా త్వరలో మహిళా సీజే రానున్నట్లు ఆయన వెల్లడించారు.

ఆర్థిక విప్లవం - 'స్వయం' బ్రాండ్ ఆవిష్కరణ:
డ్వాక్రా - మెప్మా సంఘాల బలోపేతానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చంద్రబాబు తెలిపారు. మహిళా సంఘాల ఉత్పత్తుల కోసం 'స్వయం' (SWAYAM) అనే ప్రత్యేక బ్రాండ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ బ్రాండ్‌కు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానని ప్రకటించారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ కల్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని, నాణ్యత మరియు ప్యాకేజింగ్ మెరుగుపరచడానికి అవసరమైన యంత్రాలను సమకూర్చుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 1.10 కోట్ల మంది సభ్యులున్న ఈ వ్యవస్థ ద్వారా గ్లోబల్ బ్రాండ్‌గా ఎదిగేందుకు 37 సంస్థలతో ఎంఓయూలు చేసుకున్నట్లు వెల్లడించారు.
పారిశ్రామికవేత్తలుగా లక్షలాది మంది మహిళలు:
గత ఏడాది కాలంలోనే రాష్ట్రంలో 1.12 లక్షల మంది మహిళలను ఎంఎస్ఎంఈల ద్వారా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి గర్వంగా ప్రకటించారు. వచ్చే ఏడాదిలో మరో 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడమే లక్ష్యమని, తద్వారా దేశంలోనే అత్యధికంగా 6 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని పేర్కొన్నారు. తన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి హెరిటేజ్ సంస్థను సమర్థవంతంగా నడుపుతున్నట్లే, ప్రతి ఇంట్లో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు.
నా సతీమణి, నా కోడలు మాదిరిగానే
రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే మేం నిర్వహిస్తున్న కంపెనీని నిర్వహించాలని నా సతీమణిని కోరాను. మొదట్లో నిరాకరించినా ఇప్పుడు ఆమె, బ్రాహ్మణితో కలిపి హెరిటేజ్ ను అద్భుతంగా నడుపుతున్నారు. హెరిటేజ్ నుంచి వస్తున్న సంపాదనతో గౌరవంగా రాజకీయం చేస్తున్నాం. నా సతీమణి, నా కోడలు మాదిరిగానే ప్రతీ ఇంట్లోని ఆడబిడ్డ పారిశ్రామిక వేత్తలుగా ఉండాలనేది నా ఆకాంక్ష. వెలుగు ప్రాజెక్టు కింద స్వయం సహాయ సంఘాలను తీసుకువచ్చి పేదరికం నుంచి పైకి తీసుకు వస్తాం. పీ4 ద్వారా 10 లక్షల బంగారు కుటంబాలను 1 లక్ష మంది మార్గదర్శుల ద్వారా సాయం అందిస్తున్నాం. పేదల జీవన ప్రమాణాలు పెరగాలన్నదే నా లక్ష్యం. మహిళల భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదు. గత పాలకులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లను తయారు చేశారు. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుందని పదేపదే హెచ్చరిస్తున్నాను - సీఎం చంద్రబాబు నాయుడు.
సంక్షేమం-భద్రత:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 'తల్లికి వందనం' కింద ఎంతమంది బిడ్డలున్నా ఒక్కొక్కరికి రూ. 15 వేలు అందిస్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. 'స్త్రీశక్తి' పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇప్పటివరకు 50 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని వెల్లడించారు. అలాగే, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్నామని, అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ మహిళలపై ఆ భారం పడకుండా ఉచితంగానే అందిస్తామని స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో రాజీ లేదని, వారి జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు.
పాపులేషన్ మేనేజ్‌మెంట్..
మారుతున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా 'పాపులేషన్ మేనేజ్‌మెంట్' అవసరమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేలా ప్రత్యేక ప్యాకేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పెద్ద కుటుంబాలకు అదనపు పెన్షన్, ట్రిపుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, 60 కేజీల వరకు రేషన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. మహిళలకే కాకుండా, ఇద్దరు పిల్లలున్న పురుషులకు కూడా రెండు నెలల పాటు మెటర్నిటీ సెలవులు (పితృత్వ సెలవులు) ఇచ్చేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లు వెల్లడించారు. జనాభా తగ్గుదల వల్ల భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
మహిళలు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ఆర్థికంగా ఎదగడంతో పాటు కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలని చంద్రబాబు కోరారు. 'రైట్స్, జస్టిస్, యాక్షన్' అనే థీమ్ ద్వారా మహిళల హక్కులను కాపాడుతూ, వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లేందుకు తన ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
-
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!! -
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
ఇక మంటలే: ఈరోజు, రేపు బయటకు రావద్దు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరికలు..!! -
జగన్ అరెస్ట్ ఖాయం - తేల్చేసిన బీజేపీ ముఖ్య నేత..!! -
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications