‘ఇళ్లు లేని పేదవాడు’ ఉండకూడదు. 2029 నాటికి 17 లక్షల గృహాలు

రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో టిడ్కో ఇళ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసిన అనంతరం ఏర్పాటు చేసిన 'ప్రజావేదిక' సభలో ఆయన ప్రసంగించారు. ఉగాది, రంజాన్ పండుగల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాల పండుగను జరుపుకుంటున్నామని, ఇది తనకు పూర్తి సంతృప్తిని ఇస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.

పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం చేపట్టిన యుగపురుషుడు నందమూరి తారకరామారావు ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం తెలిపారు. "కూటమి అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అప్పగించాం. త్వరలో మరో 4.5 లక్షల ఇళ్లను నిర్మిస్తాం. 2029 నాటికి రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలే ఉండకూడదన్నది మా లక్ష్యం. ఇందుకోసం ఇంకా 17 లక్షల పైచిలుకు ఇళ్లు నిర్మించాల్సి ఉంది" అని ఆయన వివరించారు. పేదలు ఉండే నివాస ప్రాంతాలను మురికివాడల్లా కాకుండా, గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పార్కులు, స్కూళ్లు, అంగన్‌వాడీలు వంటి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

CM Chandrababu Naidu Distributes TIDCO Houses in Naidupeta 2 Lakh Households Start New Life

గత పాలకుల విధ్వంసం.. వ్యవస్థల ప్రక్షాళన

గత ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని, టిడ్కో లబ్ధిదారులు కట్టిన రూ.174 కోట్లను కూడా వాడేసుకుందని చంద్రబాబు మండిపడ్డారు. "ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన విధ్వంసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. రూ.9.70 లక్షల కోట్ల అప్పులు చేశారు. శ్మశానాలు, కొండల్లో సెంటు పట్టాలిచ్చి పేదలను వంచించారు. లబ్ధిదారులు కట్టిన డబ్బులను ఇప్పుడు 22 వేల మందికి వెనక్కి ఇస్తున్నాం" అని ప్రకటించారు. విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తికి పేదవాడి ఇళ్లపై కనికరం లేదని ధ్వజమెత్తారు.

సంక్షేమం - అభివృద్ధి: సూపర్ సిక్స్ అమలు

సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేశామని, 63 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని సీఎం తెలిపారు. 'దీపం 2.0' కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని, త్వరలోనే ఇంటింటికీ పైప్డ్ గ్యాస్ సరఫరా చేస్తామన్నారు. అలాగే 'జల్ జీవన్ మిషన్' ద్వారా 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఇంటిపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకుంటే ఉచిత విద్యుత్ పొందే అవకాశం ఉందని, ఈ దిశగా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

మహిళా సాధికారత.. పారిశ్రామికవేత్తలుగా 5 లక్షల మంది

వచ్చే ఏడాది నాటికి 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తే చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెరుగుతుందని, సామాజిక సేవకు ముందుకు వచ్చే మహిళలకు ఎన్డీఏ కూటమి ఎప్పుడూ స్వాగతం పలుకుతుందని చెప్పారు.

మత్స్యకారులకు భరోసా.. పోలవరం పూర్తి

నాయుడుపేట ప్రాంతంలో అటానమస్ షిప్ యార్డు వస్తుందని, మత్స్యకారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని సీఎం హామీ ఇచ్చారు. వేట నిషేధ సమయంలో ఇచ్చే సాయాన్ని రూ.20 వేలకు పెంచామన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి చేపలు పట్టకుండా నిఘా పెట్టేందుకు రెండు ప్రత్యేక బోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని పునరుద్ఘాటించారు.

సుపరిపాలనే మా బాధ్యత

రాష్ట్రంలో మొదటి తేదీనే ఉద్యోగులకు జీతాలు వచ్చేలా వ్యవస్థను గాడిలో పెట్టామని, అధికారుల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని సీఎం హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ శాఖపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని స్పష్టం చేశారు. "ప్రజలు ఓటేసి మాకు అధికారం ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ నేను కాదు. రాజకీయాల్లో ఉండేవారు ప్రజలకు మేలు చేయాలి తప్ప, ఆడబిడ్డలను సోషల్ మీడియాలో అవమానించేలా విధ్వంసం చేయకూడదు" అని చంద్రబాబు హితవు పలికారు. సంపద సృష్టిస్తూనే, సంక్షేమాన్ని సమతూకంగా ముందుకు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+