రాయలసీమ రైతుల ఆదాయం పెంచేలా.. చంద్రబాబు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రాంత రైతులకు శుభవార్త చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పూర్వోదయ పథకం కింద ఉద్యాన పంటల అభివృద్ధి పైన ప్రత్యేకంగా దృష్టి సారించి రైతులకు ఆదాయం వచ్చే ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.

ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేలా చంద్రబాబు కీలక సూచనలు
రాయలసీమ ప్రాంతంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు ఇవ్వవలసిన సబ్సిడీలు, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పైన చంద్రబాబు చర్చించారు. విస్తృత చర్చ తర్వాత రాయలసీమలో రైతుల ఆదాయాన్ని ఉద్యాన పంటల ద్వారా పెంచే ప్రణాళిక అమలుపైన మంత్రులు, అధికారులకు చంద్రబాబు కీలక సూచనలు చేశారు.

CM Chandrababu Naidu good news to increase the income of Rayalaseema farmers

Take a Poll

రాయలసీమ రైతుల కోసం సమగ్ర ప్రణాళిక
ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా ఉద్యాన సాగును ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేయాలని చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు లబ్ధి చేకూర్చేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

సదుపాయాల కల్పన దిశగా ప్లాన్
ఉద్యాన రైతుల కోసం మెరుగైన నీటి సౌకర్యాలు కల్పించాలని, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రవాణా సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పంచాయతీరాజ్ రోడ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు, గోడౌన్లు, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడం ద్వారా ఉద్యాన రైతుల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు.

అధికారులకు, మంత్రులకు చంద్రబాబు సూచన
అధిక డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పంటలను పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని చంద్రబాబు అధికారులకు, మంత్రులకు సూచించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు సంక్షేమం పైన పెద్ద ఎత్తున దృష్టి సారిస్తున్న చంద్రబాబు అన్నదాత సుఖీభవ, రైతు బీమా వంటి అనేక పథకాలను అందిస్తూ రైతాంగానికి లబ్ధి చేకూరుస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే రాయలసీమ రైతాంగానికి కూడా మేలు చేకూర్చడానికి చంద్రబాబు పక్కా ప్రణాళికతో ఆదాయ వృద్ధి జరిగేలా ప్లాన్ చెయ్యాలని సూచించారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+