తిరుపతిలో సినిమా చూపించడానికి సిద్దం అయిన చంద్రబాబు, శ్రీసిటిలో స్కెచ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో అనే విషయం రెండు నెలల్లోనే నిరూపించుకుంటున్నారు. ఒకే రోజు 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు పలు కొత్త కంపెనీలకు శంకుస్థాపన చెయ్యడానికి సీఎం చంద్రబాబు నాయుడు రంగం సిద్దం చేసుకున్నారు.
తిరుపతి జిల్లాలోలని సత్యవేడు నియోజక వర్గంలోని శ్రీసిటీలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు పలు సంస్థ కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. శ్రీసిటీలో రూ. 900 కోట్ల పెట్టుబడితో ప్రారంభం కానున్న సంస్థల్లో సుమారు 2,700 మందికి ఉపాది కల్పించడానికి రంగం సిద్దం అయ్యింది. పలు కంపెనీలకు చెందిన సీఈవోలతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చలు జరిపి పరిశ్రమల ఏర్పాటుకు సహకరిస్తామని చర్చలు జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

బెల్జియంకు చెందిన వేర్మియర్, ఇజ్రాయల్ కు చెందిన లనియోలింక్, జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమ, జపాన్ కు చెందిన నైడిక్, ఓజేఐ ఇండియా ప్యాకేజ్, దక్షణి కోరియాకు చోందిన ఎల్ జీకెమ్, భారత్ కు చెందిన అడ్త్మర్, ఆటోడేటా, బాంబే కోటెడ్ స్పెషలల్ స్టీల్స్, ఈప్యాక్, జేజీఐ, త్రినాథ్ తో పాటు సింగపూర్, యూఏఈ, జపాన్ కు చెందిన పలు కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.
తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలోని పలు కంపెనీల యాజమాన్యంతో చంద్రబాబు నాయుడికి పాత పరిచయాలు ఉన్నాయి. ఆ పరిశ్రమల యజమాన్యం సహకారంతో కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు నాయుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సీఎం అయితే పెట్టుబడి పెట్టే కంపెనీలు ఇంకా వస్తాయని, గత వైసీపీ ప్రభుత్వానికి, ఇప్పటి కూటమి ప్రభుత్వానికి తేడా చూపిస్తామని టీడీపీ నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications