Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టాటా గ్రూప్ స్పీడ్ పెంచాలి, చైర్మన్ కు సీఎం విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులు, టాటా గ్రూప్ ప్రాజెక్టుల పురోగతి వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది ముఖ్యమంత్రి చేపట్టిన దావోస్ పర్యటనపై చంద్రశేఖరన్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

దావోస్ పర్యటనను ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలను అర్థం చేసుకునే కీలక వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివర్ణించారు. పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకోవడం, ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడంలో ఈ పర్యటన ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఏపీని గ్లోబల్ బ్రాండ్‌గా నిలబెట్టడంలో, కొత్త పాలసీలపై మార్కెట్ అంచనాలు తెలుసుకోవడంలో దావోస్ పర్యటన కీలక పాత్ర పోషించిందని సీఎం చెప్పారు.

CM Chandrababu Naidu Meets Tata Sons Chairman Chandrasekaran Discusses Investments and Davos Outcomes

ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు..

2025 దావోస్ పర్యటనలో జరిగిన చర్చల ఫలితంగా ఇప్పటికే రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన విభిన్న సమావేశాల్లో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వ్యవసాయం, టూరిజం వంటి రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న పురోగతిని ప్రపంచ సంస్థలకు వివరించామని తెలిపారు.

దిగ్గజ కంపెనీల ఆసక్తి

గతంతో పోలిస్తే భారత్ పట్ల ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆసక్తి గణనీయంగా పెరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. యువశక్తి, సమర్థ నాయకత్వం, స్పష్టమైన పాలసీల కారణంగా నేడు భారత్‌లో ప్రతి రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఏర్పడుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ మార్పును ప్రపంచం గమనిస్తోందని సీఎం తెలిపారు.

విశాఖలో టీసీఎస్..

ఈ సమావేశంలో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ కూడా ప్రపంచ స్థాయి కంపెనీల ఆలోచనలు, తన అనుభవాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు. విశాఖపట్నంలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్, అమరావతిలో క్వాంటం వాలీ, కర్నూలులో చేపట్టిన సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై ఇద్దరూ సమీక్షించారు.

రాష్ట్రానికి ప్రత్యేక అధికారులు..

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా చేపట్టే కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేకంగా చర్చించామని చంద్రశేఖరన్ తెలిపారు. ఈ అంశంపై టాటా ట్రస్ట్ నుంచి ప్రత్యేక అధికారులను రాష్ట్రానికి పంపి మరింతగా చర్చిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో టాటా గ్రూప్ చేపట్టిన టూరిజం ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

అదేవిధంగా రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్ సిటీల నిర్మాణంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని, ఈ రంగంలో పెట్టుబడుల అవకాశాలను టాటా గ్రూప్ పరిశీలించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న టాటా గ్రూప్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కూడా చంద్రబాబు కోరగా, అన్ని అంశాలను సమీక్షించి ప్రాజెక్టుల పూర్తికి సహకరిస్తామని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+