తెరపై జమిలి: గుజరాత్‌లో చంద్రబాబు- మోదీతో మంతనాలు?

Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ ఉదయం ఆయన ప్రత్యేక విమానంలో దేశ రాజధాని నుంచి అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గాంధీనగర్‌కు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇందులో పాల్గొన్నారు.

రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అండ్ ఎక్స్‌పో 2024 నాలుగో విడత సమావేశానికి గాంధీనగర్ ఆతిథ్యాన్ని ఇస్తోండటమే దీనికి కారణం. ఇక్కడి మహాత్మా మందిర్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. ఇందులో పాల్గొనడానికి చంద్రబాబు అక్కడికి వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రసింగ్ పటేల్, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి హాజరయ్యారు.

CM Chandrababu Naidu reached Ahmedabad to attend the 4th RE-INVEST Gandhinagar

ఈ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలు తమ స్టాల్స్‌ను ఈ ఎక్స్‌పోలో ఏర్పాటు చేశాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల్లో పెట్టుబడులను పెట్టడానికి గల అవకాశాలపై సందర్శకులకు వివరిస్తోన్నాయి.

రాష్ట్రంలో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు, ఇక్కడి వనరులు, పెట్టుబడిదారులకు ప్రభుత్వం కల్పిస్తోన్న రాయితీలు, ఇతర ఆర్థిక ప్రోత్సాహకాల గురించి చంద్రబాబు ఈ సదస్సులో వివరించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి వివరాలపై ఆయన ఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారని తెలుస్తోంది.

కాగా తాజాగా తెరపైకి వచ్చిన వన్ నేషన్- వన్ ఎలక్షన్‌ అంశంపై ప్రధాని మోదీతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించే అవకాశాలు లేకపోలేదని సమాచారం. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ అయిదేళ్ల కాలంలోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను నిర్వహించబోతోంది.

గతంలో ఈ జమిలి ఎన్నికలను నిర్వహించడానికి గల సాధ్యసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సిఫాసుల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభకు ఒకేసారి పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలంటూ కేంద్రం ఆదేశాలను జారీ చేసినట్లు ఉన్నత స్థాయి అధికార వర్గాలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+