హైదరాబాద్ కంటే మిన్నగా, చైనా షాంఘైలా: బాబు
చిత్తూరు: హైదరాబాదుకంటే మిన్నగా మూడు నగరాలను నిర్మిద్దామని, చైనాలోని ప్రముఖ వాణిజ్య నగరం షాంఘై స్థాయిలో విశాఖ, బీమవరం ప్రాంతాలను అంతర్జాతీయ ఎగుమతి కేంద్రాలుగా అభివృద్ధి చేద్దామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం అన్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో సుగంధ ద్రవ్యాల పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీతారామన్ మాట్లాడుతూ విశాఖ, భీమవరం పట్టణాలను ఎగుమతి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలన్న డిమాండ్ గత 25ఏళ్లుగా ఉందన్నారు. దీంతో రెండింటినీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్‌కు ఎంపిక చేశామన్నారు. గుంటూరు సుగంధ ద్రవ్యాల పార్క్ అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. నూతన పారిశ్రామిక విధానంలో ఇండస్ట్రియల్ పార్కులకు ఇచ్చే రాయితీలు సుగంధ ద్రవ్యాల పార్క్ యూనిట్లకు ఇస్తామన్నారు.
దేశంలో 109 రకాల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతుంటే, కేవలం 51 ఉత్పత్తులపైనే పరిశోధనలు సాగుతున్నాయని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో కుంకుమ పువ్వు, కేరళలో జాజికాయ, మిరియాలు, రాజస్థాన్‌లో జీలకర్ర, ధనియాలు, ఆంధ్రప్రదేశ్‌లో ఆవాలు, మిర్చి, పసుపువంటి సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. 600 ఏళ్ల క్రితమే సుగంధ ద్రవ్యాల కోసం విదేశీయులు మనదేశానికి వచ్చిన చరిత్ర ఉందన్నారు.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం నాడు విమానాశ్రయంలో మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సోమవారం నాడు విమానాశ్రయంలో రిసీవ్ చేసుకుంటున్న కోడెల, ఇతర టీడీపీ నేతలు

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సోమవారం నాడు విమానాశ్రయంలో రిసీవ్ చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు

చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సోమవారం నాడు విమానాశ్రయంలో రిసీవ్ చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు
దేశంలో పండే మిర్చిలో 60 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతోందని, ఇందులో 50శాతం మిర్చి ఉత్పత్తి ఒక్క గుంటూరు జిల్లాలోనే జరుగుతోందన్నారు. అందువల్లే గుంటూరును స్పైసెస్ డెస్టినేషన్‌గా గుర్తించామన్నారు. 125ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన స్పైసెస్ పార్కు ప్రమోటర్‌గా ఆచి మసాలా సంస్థను నియమించారని, ఈ సంస్థ ద్వారా రైతులకు తమ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసుకునే అవకాశం లభిస్తుందన్నారు.
రైతులు పండించిన మిర్చిని ఇక్కడ ప్రాసెసింగ్ చేసుకోవచ్చని చెప్పారు. అలాగే పసుపు, కరివేపాకు వంటి పంటలను నిల్వ చేసేందుకు కూడా గోదాములు ఏర్పాటవుతాయన్నారు. ప్రస్తుతం 18 యూనిట్లకు 38 ఎకరాలు కేటాయించినట్టు చెప్పారు. అధునాతన ప్యాకింగ్ సౌకర్యాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని, రైతులు తమ ఉత్పత్తులను తక్కువ అద్దెకు నిల్వ చేసుకోవచ్చని నిర్మలా సీతారామన్ అన్నారు.
రాష్ట్రంలో ఎవరికీ ఉద్యోగం పోదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అవసరమైతే కొత్త నియామకాలు చేపడతామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఎవరినీ తొలగించమన్నారు. దశలవారీగా క్రమబద్దీకరిస్తామని చెప్పారు. సోమవారం సాయంత్రం చంద్రబాబు ఉద్యోగుల సదస్సులో పాల్గొని ప్రసంగించారు. పదేళ్లలో అమరావతిని నిర్మిద్దామన్నారు.
తాను కుటుంబ పెద్దనే తప్ప, పెత్తందారును కాదన్నారు. మీ గౌరవం కాపాడాలనే 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చామన్నారు. కసితో పని చేస్తే పదిహేనేళ్లలో ఏపీకి అగ్రస్థానం వస్తుందన్నారు. పాలనలో రాజకీయ జోక్యం వద్దంటే కుదరదని, పార్టీని కాదంటే ఎన్నికల్లో కష్టాలు తప్పవని చెప్పారు.












Click it and Unblock the Notifications