స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు!

ఉత్తరాంధ్రలోని నక్కపల్లిలో కొత్తచరిత్ర తిరగరాస్తున్నామని, భారత్‌లోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌ నక్కపల్లిలో ఏర్పాటు కాబోతుందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కంటే... అతిపెద్ద పరిశ్రమను రాజయ్యపేటలో ఏర్పాటు కాబోతుందన్నారు.ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్ పెట్టుబడి గొప్ప మలుపు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే నంబర్‌వన్‌ ఉక్కు పరిశ్రమగా ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్ కాబోతుందని, కేంద్రం సహకారం ఉండటం వల్లే ఈ ప్లాంట్‌ సాధ్యం అయ్యిందన్నారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

విశాఖలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 5,465 ఎకరాల్లో ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కాబోతుందని పేర్కొన్న చంద్రబాబు ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తోందని స్పష్టం చేశారు. ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్‌కు భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు.

CM Chandrababu said the ArcelorMittal steel plant marks the foundation of a Steel City not a plant

2028 డిసెంబర్‌ నుంచి స్టీల్‌ ఉత్పత్తి

ఆర్సెలార్ మిత్తల్‌ స్టీల్‌ప్లాంట్‌ను రెండు దశల్లో పూర్తి చేస్తాం అన్న చంద్రబాబు, ఇవాళ స్టీల్‌ప్లాంట్‌కే కాదు... స్టీల్‌ సిటీకి పునాది వేశాం అన్నారు. ఆర్సెలార్ మిత్తల్‌ స్టీల్‌నే ప్రపంచంలో అధికంగా వినియోగిస్తున్నారన్నారు. 2028 డిసెంబర్‌ నుంచి స్టీల్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు.ఆర్సెలార్ మిత్తల్ స్టీల్‌ప్లాంట్‌ ద్వారా ఈ ప్రాంత రూపురేఖలే మారిపోతాయన్నారు.

విశాఖని ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తామని చంద్రబాబు హామీ

కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇప్పటికే 20లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి సాధించామని, మూడేళ్లలో 22లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. విశాఖని ప్రపంచ స్థాయి నగరంగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్, నెల్లూరులో బిపిసిఎల్ రాబోతుందని చంద్రబాబు పేర్కొన్నారు. విశాఖ, అమరావతి, తిరుపతిని మూడు రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం చెప్పిన చంద్రబాబు రేర్ ఎర్త్ మినరల్స్‌ హబ్‌గా విశాఖ మారుతుందన్నారు.

స్పీడ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు వెళ్తున్నాం

ఇదే సమయంలో ఉత్తరాంధ్రను పారిశ్రామిక ప్రగతిలో ముందుకు తీసుకువెళ్లే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జులైలో ప్రారంభిస్తాం చంద్రబాబు వెల్లడించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్ బిజినెస్‌ నుంచి... స్పీడ్‌ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు వెళ్తున్నాం అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రికార్డుస్థాయిలో భూసేకరణ చేశామన్నారు. దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఏపీలో ఉన్నన్ని వనరులు ఎక్కడా లేవని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇచ్చిన హామీలను 20 నెలల్లోనే పూర్తి చేశాం

అద్భుత విజయాలకు ఏపీని కేంద్రంగా పెట్టుబడిదారులు చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఎన్నికలలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇచ్చిన హామీలను 20 నెలల్లోనే పూర్తి చేశామని, ఏ పని తలపెట్టిన బేషరతుగా మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు అన్నారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టును తీసుకురావడానికి ప్రణాళికబద్ధంగా లోకేష్ పని చేశారని, మంత్రి లోకేష్ కు అభినందనలను తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+