జగన్‌కి సీఎం చంద్రబాబు బిగ్ షాక్.. ఆరేళ్ల క్రితం వీడియో పోస్ట్ !
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి సీఎం జగన్ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ప్రజావేదిక కూల్చివేత కూడా ఒకటి. ప్రజా వేదికను అక్రమ కట్టడంగా పేర్కొంటూ.. ఆక్రమణల తొలగింపు ప్రజావేదిక నుంచే ప్రారంభం కావాలని జగన్ ఆదేశించారు. కలెక్టర్ల సమావేశంలో ఆదేశాలివ్వడంతో జేసీబీలతో దాన్ని కూల్చివేశారు. అయితే ఈ కూల్చివేత ఘటన పట్ల టీడీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఆ ఘటన నాడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపింది.
ఆక్రమణల తొలగింపు పేరుతో.. చంద్రబాబు తలపెట్టిన నిర్మాణాలను జగన్ కూల్చేవేయడమే ప్లాన్ అంటూ టీడీపీ నేతలు అప్పట్లో ధ్వజమెత్తారు. చంద్రబాబు సైతం ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ పతనం ప్రారంభమైందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రజావేదిక కూల్చివేతకు నేటితో ఆరేళ్లు పూర్తి అవుతున్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ వ్యవహారం మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఏం పోస్ట్ చేశారంటే..?
ఈ మేరకు ఆ పోస్టులో చంద్రబాబు.. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు అయిందని, నాడు సాగిన అరాచక, అప్రజాస్వామిక పాలన నేటికీ దేశంపై మానని గాయంగా మిగిలిపోయిందని రాసుకొచ్చారు. అందుకే సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని.. అలాగే రాష్ట్రంలో 6 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజావేదిక కూల్చి గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంస పాలనకు తొలి అడుగు వేసిందని గుర్తు చేశారు. ఎమర్జెన్సీని మించిన నియంతృత్వ పాలనకు తెరలేపిందని.. అయితే ప్రజాస్వామ్యంలో నియంతలకు, విధ్వంసకారులకు చోటు లేదని.. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ద్వారా ప్రజలు నిరూపించారన్నారు.
కూల్చివేతల పాలకులను కూల్చిన ప్రజలు...పునర్మిర్మాణ బాధ్యతను కూటమికి అప్పగించారని తెలిపారు. అందుకే ఒక కసి, పట్టుదలతో రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రజావేదిక కూల్చివేతకు 6 ఏళ్లు అయిన సందర్భంగా నాటి ఘటనను గుర్తు తెచ్చుకుని... మరింత గట్టి సంకల్పంతో వికాసం వైపు ప్రయాణం చేద్దామని పిలుపునిచ్చారు.
#6YearsOfPrajaVedikaDemolition
— N Chandrababu Naidu (@ncbn) June 25, 2025
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు. నాడు సాగిన అరాచక, అప్రజాస్వామిక పాలన నేటికీ దేశంపై మానని గాయంగా మిగిలిపోయింది. అందుకే సంవిధాన్ హత్య దివస్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో 6 ఏళ్ల క్రితం ఇదే రోజున ప్రజావేదిక… pic.twitter.com/CS5ZKFqJmC
చంద్రబాబు పోస్ట్ చేసిన ఈ వీడియోను కూటమి నేతలు, తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వైసీపీపై, మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది. వైసీపీ నేతలు ఈ పోస్టుపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
-
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం!












Click it and Unblock the Notifications