రేవంత్ పై స్విగ్గీ బాయ్ కామెంట్స్..! గుంటూరులో వైసీపీ నేత అరెస్ట్..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వైఎస్సార్సీపీ నేత ఒకరు ఇావాళ అరెస్టు అయ్యారు. తెలంగాణ పోలీసులు ఇవాళ గుంటూరులో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్న యనమల నాగార్జున యాదవ్ (Yanamala Nagarjuna yadav) ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఆయన అరెస్టుపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు, స్థానిక నల్లపాడు పోలీసులకు పూర్తి వివరాలు ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు.

సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తాజాగా సాక్షి టీవీ చర్చలో నాగార్జున యాదవ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ను స్విగ్గీ, జొమాటో బాయ్ అని ఆయన వ్యాఖ్యానించారు. టీవీ షో నడుపుతున్న కొమ్మినేని శ్రీనివాసరావు అభ్యంతరం చెబుతున్నా వినకుండా పదే పదే రేవంత్ ను స్విగ్గీ, జొమాటో బాయ్ ముఖ్యమంత్రి అంటూ నాగార్జున యాదవ్ పలుమార్లు పేర్కొన్నారు. దీనిపై తెలంగాణలో కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఈ మేరేకు హైదరాబాద్ లో నమోదైన కేసు మేరకు తెలంగాణ పోలీసులు ఇవాళ గుంటూరుకు వచ్చి ఆయన్ను ఇంట్లోనే అరెస్టు చేశారు.

ysrcp spokesperson yanamala Nagarjuna Yadav arrest for derogatory remarks on cm revanth reddy

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెలంగాణ పోలీసులు అని చెప్పి యనమల నాగార్జున యాదవ్ ను అరెస్టు చేసి తీసుకెళ్లాయని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నాగార్జున యాదవ్ భార్యతో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం స్థానిక గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగార్జున యాదవ్ ను హైదరాబాద్ తీసుకెళ్లిన తర్వాత పోలీసులు ప్రాధమిక విచారణ జరిపి అనంతరం కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణకు వెళ్లి ఏపీ పోలీసులు రావణ్ తో పాటు జర్నలిస్ట్ కేవీఆర్ ను అరెస్టు చేసి ఏపీలో వరుసగా అరెస్టులు చేయడం, జైళ్లకు పంపడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+