4రూపాయల ఖర్చుతో సమస్య పరిష్కారం.. సీఎం చంద్రబాబు సత్తా ఇది!
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన విషయంలో ఎంతటి దక్షత కలిగిన వ్యక్తో చెప్పడానికి తాజాగా జరిగిన ఒక ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. చిత్తూరు జిల్లా కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయంలో సోమవారం స్వర్ణకుప్పం విజన్ 2029 కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ముఖాముఖిలో సీఎంతో మాట్లాడిన జాతీయ సైబర్ భద్రత పరిశోధనా కౌన్సిల్ డైరెక్టర్ పెనుమర్తి హరికృష్ణ చంద్రబాబును ఉద్దేశించి చెప్పిన ఒక విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
దటీజ్ చంద్రబాబు
చంద్రబాబుతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన జీతం మూడు వేల రూపాయలు అని అప్పుడు తనకు ఒక కష్టం వచ్చిందని నాలుగు రూపాయల ఖర్చుతో చంద్రబాబుకు ఈమెయిల్ చేస్తే రెండు నెలలలో పరిష్కరించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పరిపాలన దక్షతకు ఇదే నిదర్శనమని జాతీయ సైబర్ భద్రతా పరిశోధన కౌన్సిల్ డైరెక్టర్ చెప్పిన మాటలతో అక్కడ ఉన్న ప్రతిఒక్కరూ చర్చించుకున్నారు.

ఏపీలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్న ఎన్ సి ఎస్ ఆర్ సి డైరెక్టర్
ఇక ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశ్ కు తాను 100 కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. అయితే ఇటీవల చంద్రబాబును సంప్రదించడం కోసం మూడు సార్లు మెయిల్ చేశానని కానీ ఎటువంటి స్పందన రాలేదని తాను మెయిల్ చేసిన మెయిల్ ఐడిని వెల్లడించారు. సీఎం ఎట్ ఏపీ జివోవి డాట్ ఇన్ కు మెయిల్ చేశానని పేర్కొన్నారు.
ఏపీని సైబర్ భద్రతలో నెంబర్ 1గా చేస్తానన్న చంద్రబాబు
చంద్రబాబు అవకాశం ఇస్తే సైబర్ ద్వారా ప్రభుత్వానికి వెయ్యి కోట్ల ఆదాయం తెప్పిస్తానని పేర్కొన్నారు. ఇక ఎన్సిఎస్ఆర్సి డైరెక్టర్ పెనుమర్తి హరికృష్ణ చెప్పిన మాటలను శ్రద్ధగా విన్న చంద్రబాబు తన కార్యదర్శి ప్రద్యుమ్న మీతో మాట్లాడతాడని సైబర్ భద్రతా సాంకేతిక బృందంలో మిమల్ని సలహాదారుగా చేర్చుకుంటామని హరికృష్ణకు హామీ ఇచ్చారు. ఇక సైబర్ భద్రతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలుపుతానని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు.
వారంతా గురు దక్షిణ ఇవ్వాలని కోరిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగ వృద్ధికి తాను ఎంతగానో కృషి చేశానని పేర్కొన్న చంద్రబాబు తాను చేసిన కృషి ద్వారా ఫలాలు పొందిన వ్యక్తులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గురుదక్షిణ ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు సహజంగా కొన్ని అవరోధాలు వస్తాయని చెప్పిన చంద్రబాబు అటువంటి సందర్భాలలో మీలాంటి వ్యక్తులతో మాట్లాడడానికి అవకాశం ఉండదని త్వరలోనే ఈ పరిస్థితులను చక్కదిద్దుతానని జాతీయ సైబర్ భద్రత పరిశోధన కౌన్సిల్ డైరెక్టర్ కు హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications