ఆ తప్పులు సరిదిద్దాలనే సింగపూర్‌ పర్యటన - సీఎం చంద్రబాబు

గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని సింగపూర్‌ పర్యటనకు వచ్చా అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన సింగపూర్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా.. తెలుగు డయాస్పోరా ఫ్రమ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఏషియా కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుబడులే లక్ష్యంగా పర్యటన కొనసాగుతోందని.. సింగపూర్‌ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని కోరారు. టీడీపీ హయాంలోనే మూడేళ్లలో 300 ఇంజినీరింగ్‌ కళాశాలలు ఏపీలో ఏర్పాటయ్యాయని తెలిపారు. ఆనాడు పెద్దఎత్తున ఇంజినీరింగ్‌ కళాశాలల ఏర్పాటుపై చాలా మంది విమర్శించారని.. కానీ ఈనాడు పరిస్థితి ఏంటో అందరికీ తెలుసని అన్నారు .

పీవీ నరసింహారావు ప్రస్తావన..

1991లో పీవీ నరసింహారావు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక దిశను మార్చేశాయని, ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా తెలుగువారు గ్లోబల్ స్థాయిలో శాసించే స్థాయికి చేరారని ఆయన పేర్కొన్నారు.

cm-chandrababu-speech-in-telugu-diaspora-from-southeast-asia-program-at-singapore

సింగపూర్‌లో తెలుగు ప్రజల స్థానం..

ప్రస్తుతం సింగపూర్‌లో 40,000 మందికి పైగా తెలుగు ప్రజలు ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో తెలుగువారు సత్తా చాటుతున్నారని చంద్రబాబు గర్వంగా తెలిపారు. అమరావతి మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా అందించడం, రెండు దేశాల మైత్రిని మరింత బలోపేతం చేసిందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా తెలుగు ప్రజలు ఉన్నారని, వారు రాష్ట్ర అభివృద్ధి పట్ల ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.

గత ప్రభుత్వ తప్పులపై విమర్శ..

2019 తర్వాత సింగపూర్ ప్రభుత్వంపై తప్పు భావన కలిగించారని, ఆ తప్పులను సరిదిద్దేందుకు సింగపూర్ పర్యటన చేస్తున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతింటే రాష్ట్రానికి నష్టం జరుగుతుందని, ఈ సందేశాన్ని సింగపూర్ ప్రభుత్వానికి తెలియజేశానని ఆయన తెలిపారు.

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగువారు ఉంటే, ఆ క్రెడిట్ చంద్రబాబుకే చెందుతుంది. ఆయన విజనరీ కావడంతో తెలుగువారు అన్ని రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు'' అని అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో సింగపూర్‌ను రోల్ మోడల్‌గా తీసుకొని, ఆర్థిక అభివృద్ధి దిశగా పని చేస్తామని లోకేశ్ తెలిపారు. చంద్రబాబు అరెస్టయినప్పుడు హైదరాబాద్‌లో 45,000 ఐటీ నిపుణులు ఆయనకు మద్దతుగా నిలబడ్డారని, అది వారికి ధైర్యం ఇచ్చిందని లోకేశ్ గుర్తు చేశారు.

తెలుగు జాతి అన్ని రంగాల్లో నెంబర్ వన్ కావాలనే సంకల్పంతోనే రాష్ట్రాన్ని గాడిలో పెట్టే కృషి జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు నారాయణ, టీజీ భరత్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. గత ఐదు ఏళ్లలో రాష్ట్రంలో సైకో పాలన, విధ్వంసకర పాలన చూశాం. ఎన్నికల సమయంలో కొందరు దాదాపు 6 నెలలు ఏపీలో కష్టపడ్డారు. రాష్ట్రాన్ని తిరిగి దారిలో పెట్టే విషయంలో అండగా నిలిచిన వారందరికీ నమస్కారం'' అని లోకేశ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+