ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి.. పరవశించిన చంద్రబాబు

విజయవాడలో చేనేత దినోత్సవాన్ని ముగించుకుని ఉండవల్లి వెళ్తున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వెంటనే ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి కిందకు దిగిన చంద్రబాబు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను తిలకించారు. అంతేగాక, వరద ప్రవాహాన్ని చూసేందుకు బ్యారేజీ వద్దకు వచ్చిన సందర్శకులను దగ్గరకు పిలిచి మాట్లాడారు. చంద్రబాబుతో పలువురు సందర్శకులు సెల్ఫీలు దిగారు.

కృష్ణమ్మకు జలకళ ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రిచంద్రబాబు ఈ సందర్బంగా తెలిపారు. నీటి ప్రవాహాన్ని చూస్తుంటే ఎంతో సంతృప్తిగా ఉందంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే స్వయంగా ముఖ్యమంత్రి తమ దగ్గరకు వచ్చి మాట్లాడడంతో సందర్శకులు ఆశ్చర్యానికి గురయ్యారు. చాలా సంతోషంగా ఉందన్నారు.

CM Chandrababu visits Prakasam Barrage Flood

భువనేశ్వరికి 2 చీరలు కొన్న చంద్రబాబు

అంతకుముందే విజయవాడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. స్టాళ్లలో ఉత్పత్తులు పరిశీలించి చేనేత కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన సతీమణి భువనేశ్వరికి రెండు చీరలు కొనుగోలు చేశారు చంద్రబాబు. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చేనేతకారులకు ఇచ్చిన అన్ని పథకాలనూ గత వైఎస్సార్సీపీ సర్కారు రద్దు చేసిందని మండిపడ్డారు. నెలలో ఒకరోజైనా చేనేత వస్త్రాలు ధరించాలని పిలుపునిచ్చారు.

'నామినేటెడ్‌ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, స్పీకర్‌ పదవులను బీసీలకే ఇచ్చాం. మంత్రివర్గంలోనూ అగ్రస్థానం కల్పించిన పార్టీ మాది. బీసీలు ఆది నుంచీ పార్టీకి అండగా ఉన్నారు. స్థానిక సంస్థల్లో మళ్లీ రిజర్వేషన్లు తెస్తాం. అలాగే చేనేత రంగంలో సమగ్ర విధానం తీసుకొస్తాం. చేనేతకారుల్లో నైపుణ్యం పెంచి ఆధునిక శిక్షణ ఇప్పిస్తాం. వారికి ఆరోగ్యబీమా కల్పిస్తాం. చేనేత కార్మికులకు జీఎస్టీ తొలగించేందుకు ప్రయత్నిస్తాం. జీఎస్టీ తొలగించకుంటే రియంబర్స్‌ చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కార్మికుల ఆదాయం పెరిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు సీఎం చంద్రబాబు.

నేతన్నలకు రూ.67 కోట్లు ఇచ్చి న్యాయం చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. నేతన్నలు సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పారు. చేనేత మగ్గాల కోసం రూ.50 వేలు సాయం చేస్తామన్నారు. చేనేత వస్త్రాలకు ఆన్‌లైన్ మార్కెటింగ్‌ను ప్రోత్సహిస్తాం. చేనేత మరమగ్గాల కార్మికులకు, సౌర విద్యుత్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్‌ అందిస్తాం. చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తాం. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చేనేతలో సహజ రంగులను ప్రోత్సహిస్తామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు, చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33శాతం రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఇది పార్లమెంటులో చట్టరూపం దాల్చేలా పోరాటం చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+