బెజవాడకు మళ్లీ వరద ఛాన్స్..! చంద్రబాబు అలర్ట్-బుడమేరులో పెరిగిన ప్రవాహం..!
బెజవాడను ముంచెత్తిన వరదల నుంచి ఇంకా జనం కోలుకోకముందే సీఎం చంద్రబాబు మరో బ్యాడ్ న్యూస్ చెప్పారు. నగరానికి మరో వరద ముప్పు పొంచి ఉందని వెల్లడించారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులు, అధికారుల్ని టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన హెచ్చరించారు. ఇప్పటికే బుడమేరు కాలువకు పడిన గండ్లను పూడ్చిన తర్వాత అంతా సద్దుమణిగిందని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు హెచ్చరికలతో కలెక్టర్లు కూడా కింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు.
తెలంగాణలో పడుతున్న భారీ వర్షాల కారణంగా బెజవాడకు మరోసారి వరద వచ్చే అవకాశాలు ఉన్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అధికారులు, మంత్రులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు,అధికారులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

వాస్తవానికి ఇవాళ సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని చంద్రబాబు అధికారులకు తెలిపారు. అయితే తెలంగాణలో పడే వర్షాల వల్ల ఏపీ కి కొంత వరద వచ్చే అవకాశం ఉందని,దీనికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించారు. మరోవైపు బుడమేరు కాలువ ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. దీంతో గన్నవరం-కంకిపాడు మధ్య హైదరాబాద్ నుంచి కారులో వచ్చిన ఓ వ్యక్తి గల్లంతయ్యారు. బుడమేరు నీటిలో కారు కొట్టుకుకోవడంతో ఫణి అనే వ్యక్తి గల్లంతయ్యాడు. దీంతో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications