అనంతపురం జిల్లాలో వైసీపీ సిట్టింగ్ ఎంపీ, ఎమ్మెల్యేల మార్పు - ఎవరెక్కడ..!!
ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఇంఛార్జ్ ల మార్పు పై అనుహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇచ్చి కొత్త ఇంఛార్జ్ లను ఖరారు చేస్తున్నారు. రాయల సీమ జిల్లాలో 2019 తరహాలో పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు లోక్ సభ సీట్లతో పాటుగా జిల్లాలోని పలు అసెంబ్లీ సిట్టింగ్ ల మార్పు పైన కసరత్తు పూర్తి చేసారు. మంత్రి ఉషశ్రీ సీటు మార్చారు.
మార్పులు - చేర్పులు: ముఖ్యమంత్రి సిట్టింగ్ ల్లో మార్పుల కసరత్తు తుది దశకు చేరుకుంది. అధికారికంగా 11 సీట్లలో మార్పులు ప్రకటించిన వైసీపీ..గోదావరి జిల్లాలోనూ మార్పులకు సిద్దమైంది. ప్రకాశంలో మార్పుల పైన ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ఈ సాయంత్రానికి విశాఖ జిల్లాలో సీట్ల ఖరారు పైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక, రాయలసీమలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

2019 ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైసీపీ కేవలం రెండు స్థానాలే కోల్పోయింది. టీడీపీకి పట్టు ఉన్న జిల్లా కావటంతో జగన్ 2019 తరహాలోనే పట్టు కొనాసగించాలని భావిస్తున్నారు. అందులో భాగంగా స్థానికంగా సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్లలో అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు.
ఉషశ్రీ చరణ్ కు పెనుకొండ: అనంతపురం జిల్లాలోని రెండు లోక్ సభ సీట్లలో సిట్టింగ్ ఎంపీలను మార్చటం ఖాయంగా కనిపిస్తోంది. అనంతపురం ఎంపీగా మాజీ మంత్రి శంకరనారాయణ పేరు దాదాపు ఖరారైంది. ఆయన నియోజకవర్గం పెనుకొండను ప్రస్తుత మంత్రి ఉషశ్రీ చరణ్ కు కేటాయించారు. ఇందుకు మంత్రి అంగీకరించారు.
పెనుకొండ సీటు పైన ఈ సాయంత్రం నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. హిందూపురం సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ కు ఈ సారి సీటు డౌట్ గానే కనిపిస్తోంది. ఆయన స్థానంలో హిందూపురం లోక్ సభ సీటును బోయ వర్గానికి చెందిన కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరి శాంతమ్మ పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తుది కసరత్తు తరువాత అసెంబ్లీ అభ్యర్దుల ఎంపిక పూర్తి చేసి ఈ రెండు స్థానాల్లో అభ్యర్దులను ఖరారు చేయనున్నారు.
ఇద్దరు ఎంపీల మార్పు: ఇక, శింగనమలలో సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి సీటు లేనట్లే. కొత్తగా మాజీ పోలీసు అధికారి పేరు రేసులోకి వచ్చింది. పెనుకొండలో పోటీ చేయడం తన బాధ్యత అని... వైసీపీ అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటున్నా అంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ స్పష్టం చేసారు. కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర్‌నారాయణ, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామితో నియోజకవర్గాల మార్పుపై చర్చించినట్లు సమాచారం. ఎంపీ రంగయ్యను ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications