జగన్ - షర్మిల : తండ్రి సమాధి వద్ద - కలిసే ప్రార్ధనల్లో : సీఎం భావోద్వేగం..!!
తండ్రి సమాధి వద్ద అన్న సీఎం జగన్ - చెల్లి షర్మిల కలిసి కనిపించారు. ఇద్దరూ కలిసే తండ్రికి నివాళి అర్పించారు. తల్లితో పాటుగా షర్మిల తన కుమార్తె - కుమారుడుతో కలిసి అన్న జగన్ తో పాటుగానే నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్ సతీమణి భారతితో సహా వైఎస్సార్ కుటుంబ సభ్యులు.. పార్టీ నేతలు సైతం హాజరయ్యారు. తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని సీఎం జగన్ విభేదించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ మొదలైంది. పార్టీ ఏర్పాటు తరువాత ఇద్దరూ కలిసి ఒకే వేదిక రావటం కూడా ఇష్టపడలేదు.

వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి
తల్లి విజయమ్మ సైతం వారిద్దరి మధ్య గ్యాప్ తో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. కొంత కాలంగా షర్మిల రాజకీయ పోరాటంతో తల్లిగా విజయమ్మ మద్దతుగా నిలుస్తూ వచ్చారు. అయితే, పులివెందులలో అందరూ కలిసి జరుపుకొనే క్రిస్మస్ వేడుకల్లోనూ లోటు కనిపించింది. గత రెండేళ్ల కాలంలో వైఎస్సార్ జయంతి - వర్దంతి సమయాల్లోనే వీరంతా ఇడుపుల పాయ కేంద్రంగా కలుస్తున్నారు. గత సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్దంతి నాడు.. ఇదే విధంగా సీఎం జగన్ దంపతులు - షర్మిల - విజయమ్మ తో సహా కుటుంబ సభ్యులు కలిసి వైఎస్సార్ కు నివాళి అర్పించారు.

తండ్రి సమాధి వద్ద సీఎం ఎమోషనల్
ఇక, ఈ రోజు నుంచి వైసీపీ ప్లీనరీ జరగనుంది. చివరి సారిగా 2017లో జరిగిన పార్టీ ప్లీనరీ వేదిక పైన సీఎం జగన్ తో పాటుగా తల్లి విజయమ్మ..సోదరి షర్మిల సైతం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. కానీ, ఈ సారి వైసీపీ ప్లీనరీలో విజయమ్మ గౌరవాధ్యక్షురాలి హోదాలో పాల్గొంటున్నారు. వైఎస్సార్టీపి పార్టీ ఏర్పాటుతో షర్మిల దూరంగా ఉండనున్నారు. ఈ సారి నివాళి కార్యక్రమంలో జగన్ పక్కన షర్మిల కుమారుడు రాజారెడ్డి కూర్చున్నారు. కుమారుడు - కుమార్తె మధ్య షర్మిల ఆశీసులయ్యారు. హైదరాబాద్ నుంచి కడప చేరుకున్న విజయమ్మ - షర్మిల కు వైసీపీ నేతలు - వైఎస్సార్ అనుచరులు స్వాగతం పలికారు.

ప్లీనరీకి సీఎం జగన్.. విజయమ్మ
అందరూ కలిసి ఇడుపుల పాయ వైఎస్సార్ ఎస్టేట్ లోనే కలిసి డిన్నర్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ తాము కలిసే డిన్నర్ చేసామని..పలకరించుకున్నామంటూ కొద్ది కాలం షర్మిల తాను ఇచ్చిన ఇంటర్వ్యూల్లో స్పష్టం చేసారు. ఇప్పుడూ అదే జరిగింది. అయితే, ప్రార్ధనలు ముగిసిన తరువాత సీఎం జగన్ ఎమోషనల్ గా కనిపించారు. తండ్రి సమాధి వద్ద మౌనంగా కూర్చుండిపోయారు. ప్రార్ధనలు ముగిసిన తరువాత వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. విజయమ్మ ప్లీనరీకి హాజరు కానున్నారు.












Click it and Unblock the Notifications