Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇడుపులపాయలో సీఎం జగన్ - షర్మిల : వైసీపీ నేతల స్వాగతం - డిన్నర్ మీట్..!!

సీఎం జగన్ కుటుంబ సభ్యులు ఇడుపులపాయ చేరుకున్నారు. వైఎస్సార్ జయంతి కావటంతో ఆయనకు నివాళి అర్పించేందుకు కుటుంబ సభ్యులు ఇడుపులపాయ చేరుకున్నారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా పులివెందుల చేరుకున్న సీఎం జగన్..సాయంత్రానికి వైఎస్సార్ ఎస్టేట్ కు వచ్చారు. హైదరాబాద్ నుంచి విజయమ్మ..వైస్సార్టీపీ అధినేత్రి షర్మిల తన కుమార్తె - కుమారుడు తో కలిసి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి వైసీపీ జిల్లా నేతలు స్వాగతం పలికారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, కడప నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ బండి నిత్యానందరెడ్డి ..వైఎస్సార్ అభిమానులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. వారు అక్కడ నుంచి నేరుగా ఇడుపుల పాయకు చేరుకున్నారు.

కుటుంబ సభ్యులంతా అక్కడే

కుటుంబ సభ్యులంతా అక్కడే

సీఎం జగన్ తో పాటుగా కుటుంబ సభ్యులు వైఎస్సార్ కు నివాళి అర్పించనున్నారు. కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో వీరంతా ఒకే చోటకు చేరటం రాజకీయంగానూ.. వైఎస్సార్ అభిమానుల్లో ఆసక్తి కనిపిస్తోంది. గత సెప్టెంబర్ లో వైఎస్సార్ వర్దంతి నాడు సైతం కుటుంబ సభ్యులు అందరూ కలిసి నివాళి అర్పించి.. ప్రార్ధనల్లో పాల్గొన్నారు. అయితే, గురువారం రాత్రి ఇడుపులపాయకు చేరుకున్న వైఎస్సార్ కుటుంబ సభ్యులు కలిసి డిన్నర్ చేసినట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయటం..అందుకు సీఎం జగన్ ఆమోదం తెలపకోవటంతో కొంత కాలంగా గ్యాప్ ఏర్పడింది.

వైఎస్సార్ కు నివాళి అర్పించేందుకు

వైఎస్సార్ కు నివాళి అర్పించేందుకు

అయితే, పార్టీ ఏర్పాటు తరువాత తన అన్న ఏపీ సీఎంగా ఆ రాష్ట్రం కోసం పని చేస్తారని.. తాను తెలంగాణ ప్రజల కోసం పని చేస్తానని షర్మిల స్పష్టం చేసారు. ఇక, తెలంగాణలో పాదయాత్ర చేస్తున్న షర్మిల తాత్కాలిక బ్రేక్ ఇచ్చి ఇడుపుల పాయకు చేరుకున్నారు. తిరిగి ఈ నెల 10వ తేదీ నుంచి తన పాదయాత్ర కొనసాగించనున్నారు. తల్లి విజయమ్మ సైతం కుమార్తె రాజకీయ ప్రస్థానంలో తోడుగా నిలుస్తున్నారు. అదే సమయంలో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా పార్టీ ప్లీనరీకి హాజరవుతున్నారు. తన తల్లి వైసీపీ గౌరవాధ్యక్షురాలిగానే ఉన్నారని..తన తల్లిగా తనతో పాటుగా ఉంటున్నారని గతంలోనే షర్మిల క్లారిటీ ఇచ్చారు.

సీఎం జగన్ తో కలిసి ప్లీనరీకి

సీఎం జగన్ తో కలిసి ప్లీనరీకి


వైసీపీ ప్లీనరీకి విజయమ్మ హాజరు పైనా..అదే విధంగా గౌరవాధ్యక్షురాలి పదవిలో కొనసాగటం పైన అనేక రకాల చర్చలు తెర మీదకు వచ్చాయి. గౌరవాధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామాకు సిద్దమయ్యారంటూ ప్రచారం సాగింది. కానీ, పార్టీ నేతలు మాత్రం విజయమ్మ పార్టీ ప్లీనరీకి వస్తారని.. పార్టీ శ్రేణులను ఉద్దేవించి ప్రసంగిస్తారని స్పష్టం చేస్తున్నారు. ఇక, ఇప్పడు ఇడుపులపాయలో కుటుంబ సభ్యులంతా కలవటం తో ఇప్పుడు వైఎస్సార్ అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. నివాళి కార్యక్రమం ముగిసిన తరువాత సీఎం జగన్ తో పాటుగానే విజయమ్మ సైతం ప్లీనరీ సమావేశాల కోసం రానున్నట్లు సమాచారం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+