ఏపీకి రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు - విశాఖ నుంచి పాలనపై సీఎం జగన్ కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి జగన్ ఏపీకి పెట్టుబడులు.. విశాఖ వేదికగా పాలన ప్రారంభం పై కీలక ప్రకటన చేసారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ విశాఖ వేదికగా రెండు కీలక ప్రకటనలు చేసారు. విశాఖలో ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ లో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేసారు. ఈ సదస్సు ద్వారా ఏపీకి రూ 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నట్లు ప్రకటించారు. ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ఈ రోజు..రేపు జరిగే ఒప్పందాల గురించి వివరించారు. ఇదే సమయంలో విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందని వెల్లడించారు. తాను త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తానంటూ ముఖ్యమంత్రి జగన్ సదస్సు వేదికగా పారిశ్రామిక దిగ్గజాలు - ఆహుతుల సమక్షంలో ప్రకటించారు.
ఏపీకి రూ 13 లక్షల కోట్ల పెట్టుడులు..
ఏపీకి రూ 13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సులో సీఎం జగన్ పెట్టుబడుల గురించి వివరించారు. మొత్తం 340 పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని వివరించారు. అందులో 92 ఎంఓయూలు కుదుర్చుకుంటున్నామని చెప్పారు. 20 రంగాల్లో పెట్టుబడులుకు నిర్ణయాలు జరిగాయన్నారు. 8.54 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు ఈ రోజు జరుగుతాయని.. మిగిలినవి సదస్సులో రెండో రోజున పూర్తి చేస్తారని వెల్లడించారు. ఈ పెట్టుబడల ద్వారా దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశం లభిస్తుందని ముఖ్యమంత్రి వివరించారు. ఈ ఏడాది దేశం తో పాటుగా ఏపీకి చాలా కీలకమని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. విశాఖ వేదికగా జీ 20 వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం గ్రోత రేట్ లో 11.34 శాతంతో దూసుకుపోతుందని వివరించారు. ఏపీలో సహజ వరులు పుష్కలంగా ఉన్నాయని.. పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రెండు పారిశ్రామిక కారిడార్లు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. స్కిల్డ్ యూత్, పారిశ్రామిక ఫ్రెండ్లీ ప్రభుత్వం ఏపీలో ఉందిని ముఖ్యమంతరి వివరించారు.
జగన్ లీడర్ షిప్ పై అంబానీ ప్రశంసలు..
సీఎం జగన్ నాయకత్వంలో ఏపీ ముందుకు వెళ్తోందని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ప్రశంసించారు. గతంలోనూ ఏపీలో తమ పెట్టుబడులు కొనసాగాయని..ఇప్పుడు కొనసాగుతాయని స్పష్టం చేసారు. రాష్ట్రంలో 5జీ నెట్‌వర్క్ 90శాతం కవర్ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు. రిలయన్స్ లో ఏపీకి చెందిన వారు కీలక స్థానాల్లో ఉన్నారని వెల్లడించారు. నూతన భారత దేశం నిర్మాణంలో ఏపీ కాలకం కాబోతుందన్నారు. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని అంబానీ చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని గ్రంధి మల్లికార్జున రావు పేర్కొన్నారు. హైదరాబాద్ విమానాశ్రయం తరహాలో భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మిస్తామన్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ ద్వారా లక్ష ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందన్నారు. ఏపీలో వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు రెన్యూ పవర్ ఎండీ సమంత్ సిన్హా విశాఖ సదస్సులో ప్రకటించారు.విశాఖ నుంచి పాలన ప్రారంభం కానుంది
విశాఖ పరిపాలనా రాజధాని త్వరలోనే కాబోతోందని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సదస్సు వేదికగా మరోసారి ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలోనే తాను విశాఖ నుంచి పాలన చేయటానికి సిద్దం అవుతన్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గతంలో ఢిల్లీలో చెప్పిన విధంగానే సీఎం మరోసారి విశాఖలో పెట్టుబడి దారుల సదస్సు వేదికగా ప్రకటన చేసారు. మూడు రాజధానుల కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు లో విచారణలో ఉంది. సుప్రీంలో విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వం అభ్యర్ధించింది. సుప్రీంకోర్టు ఈ నెల 28వ తేదీన కేసు విచారించాలని నిర్ణయించింది. ఈ సమయంలో ముఖ్యమంత్రి మరోసారి పాలనా రాజధాని విశాఖేనని ప్రకటన చేసారు. సీఎం జగన్ త్వరలోనే విశాఖ నుంచి పాలన చేస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేసారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications