• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్‌ఛార్జ్‌ మంత్రుల పదవుల రద్దు..!!? ఆ స్థానంలో వారికే ప్రాధాన్యం - సీఎం జగన్ టార్గెట్ 2024 ప్లాన్..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో సీఎం జగన్ 2024 ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ప్రభుత్వంలో కేబినెట్ ప్రక్షాళన తో మార్పులు ప్రారంభించిన సీఎం జగన్.. మరో కొత్త నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో పని చేసిన తొలి కేబినెట్ మంత్రులకు ఇన్ ఛార్జ్ మంత్రులుగా అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. చాలా కాలంగా రాష్ట్రంలో జిల్లా మంత్రుల కంటే..పాలనా పరమైన నిర్ణయాల్లో ఇన్‌ఛార్జ్‌ మంత్రులదే కీలక భూమిక పోషించేవారు. అయితే, 24 మంది మంత్రుల రాజీనామాతో వారికి ఉన్న హోదా సైతం పోయింది. ఇప్పుడు, కొత్తగా 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.

ఇన్‌ఛార్జ్‌ మంత్రుల హోదా రద్దు..!

ఇన్‌ఛార్జ్‌ మంత్రుల హోదా రద్దు..!

కొత్త మంత్రులకు ఇన్‌ఛార్జ్‌ మంత్రులుగా ఏ జిల్లా కు బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తమ జిల్లాలకు పరిమితం కావటం..తమ శాఖల పర్యవేక్షణకు మంత్రులు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించేలా కసరత్తు జరుగుతోంది. రాజకీయంగా పార్టీ బాధ్యతలు కొన్ని జిల్లాలు మినహా.. మిగిలిన జిల్లాల్లో మాజీ మంత్రులు..మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారికి ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త పోస్టులు సిద్దం అవుతున్నాయి.

వారికి జిల్లా అభివృద్ధి బోర్డులు ఏర్పాటుచేసి, వాటికి చైర్మన్లుగా నియమిస్తానని చెప్పిన సీఎం..ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. వారికి కేబినెట్ హోదా సైతం కల్పించే విధంగా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ హోదా కల్పిస్తే ముందుగా న్యాయ పరమైన సమస్యలు..అదే విధంగా జిల్లాలో మంత్రులు- డీడీఏ ఛైర్మన్ల మధ్య ప్రోటోకాల్ అంశాల పైన ఎదురయ్యే సమస్యల పైన ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

2024 ఎన్నికల కోసం కొత్త ప్రణాళిక

2024 ఎన్నికల కోసం కొత్త ప్రణాళిక

రీజనల్ - జిల్లా స్థాయిల్లో ఈ అభివృద్ధి మండళ్లు ఇక, అటు ప్రభుత్వం - ఇటు పార్టీకి ఒక విధంగా సమన్వయ వేదికలుగా పని చేయనున్నాయి. వీటికి సంబంధించి వచ్చే కేబినెట్ సమావేశానికి పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తి చేసి...మంత్రులకు వివరించి ఆమోద ముద్ర వేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు కూడా తమకు కావాల్సిన పనులకు సంబంధించి ఇన్‌ఛార్జ్‌ మంత్రుల ద్వారానే సంతకాలు చేయిరచుకోవాల్సి ఉండేది.

ఇప్పుడు ఈ బాధ్యతలు డిడిసి చైర్మన్లుగా వ్యవహరించే వారికి ఆ అధికారాలు కట్టబెట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాల్లో జిల్లా ప్రణాళికా కమిటీలు, డిడిఆర్‌సి (జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీలు) సైతం ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చాయి. డీడీఆర్సీ సమావేశాలకు ఇన్ ఛార్జ్ మంత్రి అధ్యక్షత వహించేవారు.

ప్రభుత్వం - పార్టీ సమన్వయం కోసం

ప్రభుత్వం - పార్టీ సమన్వయం కోసం

అక్కడ వారి ఆదేశాలే కీలకం కానున్నాయి. కానీ, ఇప్పుడు జిల్లా అభివృద్ధి మండళ్ల ఏర్పాటుతో అధికార విభజన ఏ విధంగా ఉంటుంది...మంత్రి హోదాలో తీసుకోవాల్సిన నిర్ణయాలు... జిల్లా అభివృద్ధి మండళ్ల ఛైర్మన్లు తీసుకుంటారా..అందుకు అవకాశం ఉంటుందా.. అలా చేస్తే మంత్రుల అధికారుల్లో కోత పడినట్లవుతుందా అనే కోణంలోనూ చర్చ కొనసాగుతోంది. అయితే, కొత్త సమస్యలకు కారణం కాకుండా.. కొత్త మంత్రులు - జిల్లా అభివృద్ధి మండళ్ల ఛైర్మన్లు కలిసి కట్టుగా ప్రభుత్వం - పార్టీ కోసం పని చేసేలా ఈ విధానానికి రూప కల్పన చేస్తున్నట్లు సమాచారం.

మంత్రి పదవులు రాక నిరాశ పడిన వారికి..మాజీ మంత్రులకు జిల్లాల బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దమైంది. జిల్లా అభివృద్ధి బోర్డులు ఏర్పాటు చేసి మంత్రి పదవులు కోల్పోయిన వారిలో 9 మందికి.. ఆశావాహుల్లో 17 మందికి కొత్త జిల్లాల ఆధారంగా పదవులు ఖరారు కానున్నాయి.

ఆశించి భంగపడిన వారికే ప్రాధాన్యత

ఆశించి భంగపడిన వారికే ప్రాధాన్యత

ఈ మొత్తం నియామకాలు ఈ నెలాఖరులోగానే పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు ఇన్‌ఛార్జ్‌ మంత్రుల పదవుల రద్దు అంశం పైన అధ్యయనం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని పైన తుది నిర్ణయం తీసుకున్న తరువాత... ప్రభుత్వ కొత్త ఆలోచనల మేరకు నియామక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

ఈ నియామకాలు చేపడితే..మంత్రి పదవులు దక్కని వారిని నిరాశ నుంచి తిరిగి పార్టీ పరంగా యాక్టివ్ చేసే విధంగా కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. దీంతో..ఇప్పుడు జిల్లా స్థాయిలో అయినా ఈ పదవులు దక్కించుకొనేందుకు మరోసారి పోటీ మొదలవుతోంది. దీంతో..సీఎం జగన్ ఈ నియామకాల విషయంలో తీసుకొనే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొని ఉంది.

English summary
AP Govt planing to form District Development Authorities adn Reginal development Atuthorities with Chaitman and members. Govt may remove district incharge posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X