సీఎం జగన్ కు కీలక నిర్ణయం - గౌతమ్ సవాంగ్ కు మరో ముఖ్య పదవి : ఈ ఎంపిక వెనుక..!!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజీపీ పదవి నుంచి తప్పించిన సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ కు మరో కీలక పదవి ఇప్పగించారు. ఏపీ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఛైర్మన్ గా గౌతమ్ సవాంగ్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత గౌతమ్ సవాంగ్ డీజీపీగా నియమితులయ్యారు. రెండు రోజుల క్రితం ఆయన్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఆయన స్థానంలో నిఘా చీఫ్ కే రాజేంద్ర నాధ్ రెడ్డికి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Recommended Video

సవాంగ్ కు కీలక బాధ్యతలు
అయితే, సవాంగ్ కేంద్ర సర్వీసులకు వెళ్తారనే ప్రచారం సాగింది. కానీ, సీఎం జగన్ ఆయనకు కీలకమైన ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి అప్పగించారు. ప్రస్తుతం ఏవీ రమణా రెడ్డి ఏపీపీఎస్సీ ఇన్ ఛార్జ్ ఛైర్మన్ గా కొనసాగుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా పిన్నమనేని ఉదయ భాస్కర్ నియమితులయ్యారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత సైతం ఆయన అదే పదవిలో కొనసాగారు. అయితే, ఆయనకు ప్రభుత్వం నుంచి సహకారం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక, ఉదయ భాస్కర్ పదవీ విరమణ తరువాత..ఇప్పుడు పూర్తి స్థాయిలో డీజీపీగా పని చేసిన గౌతమ్ సవాంగ్ కు అప్పగించారు.

గతంలో రాములు..ఇప్పుడు సవాంగ్
2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ రిటైర్డ్ డీజీపీ పేర్వారం రాములు ఉమ్మడి ఏపీలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా పని చేసారు. అయితే, డీజీపీగా ఆయన్ను బదిలో చేసిన తరువాత భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. బదిలీ సమయంలో ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడిలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. అయితే, రానున్న రోజుల్లో ఏపీలో ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పైన ఫోకస్ పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా కొత్తగా ఏపీపీఎస్సీ ద్వారా సంస్కరణలను సైం అమలు దిశగా నిర్ణయించింది. దీంతో..డీజీపీ స్థాయి హోదా అధికారిని ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. రాజేంద్రనాధ్ రెడ్డికి యూపీఎస్సీ నుంచి క్లియరెన్స్ రాగానే ఆయన కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఉద్యోగాల భర్తీ వ్యవహారాల్లో కీలకంగా
ఆ తరువాత సవాంగ్ సైతం ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుండటంతో ఇది పూర్తయిన తరువాత కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఉద్యోగాల భర్తీకి అనుమతి మంజూరు అయింది. అన్ని శాఖల నుంచి సమాచారం సేకరించారు. ఇక, వార్డు -గ్రామ సచివాలయాల ఉద్యోగుల ప్రొబేషన్ ప్రకటించటం.. ఉద్యోగుల సర్దుబాటు పూర్తయిన తరువాత ..కొత్త ఉద్యోగాల భర్తీ పైన కసరత్తు ప్రారంభం కానుంది. దీంతో..ఈ బాధ్యతలను గౌతమ్ సవాంగ్ కు ఇవ్వటం ద్వారా..ఆయన్ను డీజీపీగా తొలిగించిన సందర్బంలో వచ్చిన రాజకీయ విమర్శలకు సమాధానంగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications