Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సంపూర్ణ సహకారం అందిస్తాం - సీఎం జగన్ కీలక నిర్ణయం..!!

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ముగింపు వేళ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ ముగింపు వేళ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి రూ 13 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పిన సీఎం..అవి ఏర్పాటు అయ్యేలా తమ నిర్ణయం వెల్లడించారు. ఇందు కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారికి బాధ్యతలు కేటాయిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం - ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీం ఈ ఎంఓయూలు గ్రౌండ్ అయ్యేలా ప్రతీ వారం సమీక్ష చేస్తారని ప్రకటించారు. పరిశ్రమల స్థాపనలో ఎంఓయూలు చేసుకున్న ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా..పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పరిశ్రమల స్థాపనలో తాను ఎప్పుడూ ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటానని సీఎం స్పష్టం చేసారు.

పూర్తిగా మద్దతుగా నిలుస్తాం

పూర్తిగా మద్దతుగా నిలుస్తాం


రెండు రోజుల పాటు సాగిన ఈ సమావేశంలో రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు..ఆరు లక్షల మందికి ఉపాధి లభించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. సదస్సు ముగింపు వేళ రాష్ట్రంలో నెలకొల్పిన నూతన పారిశ్రామిక యూనిట్లను ముఖ్యమంత్రి శ్రీసిటీ, అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన పారిశ్రామిక యూనిట్లను కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సర్బానందతో కలిసి సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. మొత్తం రూ. 3,845 కోట్లతో నిర్మించిన పరిశ్రమలను సీఎం వైయస్‌ జగన్‌ జీఐఎస్‌-2023 వేదిక నుంచి ప్రారంభించారు. ఈ పరిశ్రమల ద్వారా 9,100 మందికి ఉపాధి లభించనుందని అధికారులు వెల్లడించారు.

ఏపీ పెట్టుబడుల కేంద్రంగా నిలుస్తోంది

ఏపీ పెట్టుబడుల కేంద్రంగా నిలుస్తోంది


సదస్సు ముగింపు ఉపన్యాసంలో ముఖ్యమంత్రి జగన్ ఏపీలో గత మూడేళ్లుగా సాధించిన పురోగతిని మరోసారి వివరించారు. పాదర్శక పాలనతో విజయాలు సాధిస్తున్నామని చెప్పుకొచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ద్వారా 15 రంగాల పైన ఫోకస్ చేసినట్లు వెల్లడించారు. ఈ 15 రంగాల్లో చర్చలు జరగటంతో పాటుగా 352 ఎంఓయూలు జరిగాయన్నారు. వంద మందికి పైగా స్పీకర్లు పాల్గొన్నారని చెప్పారు. యూఏఈ, వియత్నాం, నెదర్లాండ్స్, ఆస్ట్రియా దేశాలతో ప్రత్యేకంగా కంట్రీ సెషన్స్ నిర్వహించామని వివరించారు. మొత్తంగా 13 లక్షల 5 వేల 663 కోట్ల మేర ఒప్పందాలు జరిగాయని సీఎం జగన్ వెల్లడించారు. అందులో రూ 8 లక్షల 84 వేల కోట్ల రూపాయాలు కేవటం ఇంధన రంగంలోనే వచ్చాయని చెప్పారు. పర్యాటక రంగంలో 22 వేల కోట్ల రూపాయలు వచ్చాయని సీఎం వివరించారు.

త్వరలోనే రాష్ట్రం రూపు రేఖలు మరుతాయి

త్వరలోనే రాష్ట్రం రూపు రేఖలు మరుతాయి


ఈ సదస్సు ద్వారా జాతీయ- అంతర్జాతీయ పెట్టబడులకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏపీని పారిశ్రామిక హబ్ గా తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రం త్వరగా మరింతగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. సదస్సును విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ సీఎం ధన్యవాదాలు చెప్పారు. ఎంఓయూ నుంచి పరిశ్రమల స్థాపన దిశగా అడుగులు వేయాలని.. ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రులు..పెట్టుబడి దారులను సీఎం జగన్ సత్కరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+