ప్రధానికి క్లియర్ గా చెప్పాను, జరిగేదిదే - సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!!

ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ప్యాకేజీ అంశంపైన తన వైఖరి స్పష్టం చేసారు. పోలవరం ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం..నష్ట పరిహారం పై హామీ ఇచ్చారు. లిడార్‌ సర్వే పూర్తి చేయించాం అని చెప్పుకొచ్చారు. గ్రామాల జాబితాను కేంద్రానిని పంపామని..ఈ నెలాఖరులోగా కేంద్ర కేబినెట్ ఆమోదించే అవకాశం ఉందని చెప్పారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి తాను ప్రధానితో చర్చించిన అంశాలను వెల్లడించారు.

క్రెడిట్ ప్రధానినే తీసుకోమన్నాను
ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా అల్లూరి జిల్లా కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో ముఖా ముఖి నిర్వహించారు. పోలవరం ప్యాకేజీ గురించి వివరించారు. ప్రాజెక్టుకు మూడు దశల్లో నీరు నింపాల్సి ఉంటుందని చెప్పారు. మొదటి దశలో 41.15 దాకా డ్యామ్‌లో నీళ్లు నింపేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. కాంటూర్‌ లెవల్‌లో వచ్చే ప్రతి నిర్వాసితులకు ప్యాకేజీ ఇస్తామన్నారు.

CM Jagan

ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇచ్చేవారికి పరిహారం ఇస్తామని చెప్పారు. లిడార్‌ సర్వే ద్వారా 32 గ్రామాలకు సంబంధించి మొదటి దఫాలో చేర్చామని చెప్పుకొచ్చారు. తాను ప్రధానితో.. "మీరే నేరుగా నిర్వాసితులకు డబ్బులు జమ చేయండి. నాకు కావాల్సిందల్లా మా వాళ్లకు మంచి జరగాలి. ఆ క్రెడిట్ మీరే తీసుకోండి..వారికి నేరుగా డబ్బులు అందాలని ప్రధానికి చెప్పాను" అని సీఎం వెల్లడించారు.

ప్రతీ ఒక్కరికీ అండగా నిలుస్తాం
కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న రూ.6.8 లక్షలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున మరో రూ.3.2 లక్షలు ఇస్తామని ఇప్పటికే జీవో రిలీజ్‌ చేశామన్నారు. దీనికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. కేంద్రం డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టగానే మీ బిడ్డ ఇవ్వాల్సిన రూ.3.2 లక్షలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని హామీ ఇచ్చారు. దశలవారీగా ఇచ్చుకుంటూ వెళ్తామని వివరించారు. కచ్చితంగా ఎన్నికలకు వెళ్లేలోపలే మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

అన్నీ కూడా వచ్చే ఆరు ఏడు నెలల్లో అందరికీ అందుతుందని సీఎం జగన్‌ తెలిపారు. మరిచిపోవద్దు. ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా దాన్ని పూడ్చేందుకు, తీర్చేందుకు ఎల్లవేళలా పని చేస్తానని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఎవరికైనా సాయం అందకపోతే నేరుగా తనకే చెప్పాలని గ్రామస్థులకు సీఎం సూచించారు.

చెప్పిన మాట అమలు చేస్తాం
పోలవరం ప్రాజెక్టుకు తన తండ్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ల్యాండ్‌ అక్విజేషన్‌ చేసినప్పుడు మొదట్లో రూ.1.50 లక్షలకు జరిగిందని గుర్తు చేసారు. దాన్ని రూ.5 లక్షలు ఇస్తామని తాను చెప్పానన్నారు. మిగిలిన రూ.3.50 లక్షలు కూడా ఇస్తానని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఏ ఒక్కరూ నష్టపోయామనే మాట ఎక్కడా వినపడదని ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఉద్ఘాటించారు.

గతానికన్నా భిన్నంగా వరదలు వచ్చినప్పుడు మన ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పారు. ఎవరికి ఏ నష్టం ఆ నష్టాన్ని పూడ్చుతానని హామీ ఇచ్చారు. వారం రోజుల పాటు అధికారులు సహాయక కార్యక్రమాల్లో అలసత్వం లేకుండా పని చేశారన్నారు. గ్రామ సచివాలయాల దగ్గర నుంచి వాలంటీర్ల వ్యవస్థ వరకు ప్రతి వ్యవస్థను యాక్టివేట్‌ చేసి ఏ ఒక్కరికి ఇబ్బంది జరుగకుండా ఈ నాలుగేళ్ల పాలనలో చేశామని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+