స్వామీజీలతో కలిసి సీఎం జగన్ - విజయవాడ కేంద్రంగా..!!
ముఖ్యమంత్రి జగన్ పూర్హాహుతిలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అష్టోత్తర శత కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం ముగింపు దశకు చేరింది. అఖండ పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్‌కు పూర్ణకుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. శ్రీమహాలక్ష్మి అమ్మవారికి సీఎం వైయస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలని సీఎం జగన్ వేదపండితుల మంత్రోచ్ఛారణతో కూడిన సంకల్పం తీసుకొని ఆరు రోజుల క్రితం ఈ మహాయజ్ఞాన్నిప్రారంభించారు.
విజయవాడలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ముగిసింది. మహాయజ్ఞం ముగింపులో భాగంగా ఈరోజు అఖండ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి ముగిసింది. పాంచరాత్ర యాగశాలలో పూర్ణాహుతికి వెళ్తూ మార్గ మధ్యలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి నుంచి జగన్ ఆశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య, అష్ట ఐశ్వర్యాలతో వర్థిల్లాలని, రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలని సీఎం వైయస్ జగన్ వేదపండితుల మంత్రోచ్ఛారణతో కూడిన సంకల్పం తీసుకొని ఆరు రోజుల క్రితం ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించారు.

అఖండ దీపారాధనలో సీఎం పాల్గొన్నారు. వైఖానసం, పాంచరాత్రం, శైవం, వైదిక స్మార్తం ఆగమాలతో ఏర్పాటు చేసిన నాలుగు ప్రధాన యాగశాలల్లో యజ్ఞాలు నిర్వహించారు. వారం రోజుల పాటు ఎంతో వైభంగా యజ్ఞం జరిగింది. మొత్తం 108 కుండాలతో రుత్వికులు యజ్ఞ కార్యక్రమాలు జరిగాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు..తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు యజ్ఞం కొనసాగింది. యజ్ఞం తొలిరోజున శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, 13న ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి, 14న అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి, 15న శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, 16న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు జరిగాయి. ఈ రోజు పండితులు నిర్ణయించిన సుముహూర్తాన తిరిగి సీఎం జగన్ చేతుల మీదుగానే అఖండ పూర్ణాహుతి కార్యక్రమంతో ముగియనుంది.












Click it and Unblock the Notifications