ఎన్నికల వేళ సీఎం జగన్ సంచలన నిర్ణయం - జనవరి 25 నుంచి ఆట మొదలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హీటెక్కుతోంది. సీఎం జగన్ తన పార్టీ అభ్యర్దుల ఖరారు ప్రక్రియ వేగవంతం చేసారు. పలు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మారుస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. ప్రతిపక్షాలు పొత్తు ఖరారైనా ఎన్నికల కసరత్తు ప్రారంభించ లేదు. సీఎం జగన్ ఇక పార్టీ కేడర్ తో వరుస సమావేశాలకు నిర్ణయించారు. అదే విధంగా ఇక ప్రజల్లోనే ఉండాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ కొత్త వ్యూహాలు : ముఖ్యమంత్రి జగన్ అభ్యర్దుల ఎంపిక తుది కసరత్తు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇక, ఈ నెల మూడో వారం నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించాలని భావిస్తున్నారు. జనవరి 25వ తేదీ నుంచి ప్రజల్లో ఉండాలని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. ప్రతీ పార్లమెంట్ పరిధిలో పార్టీ కేడర్ తో స్వయంగా జగన్ సమావేశాలు నిర్వహించనున్నారు. అయిదేళ్ల కాలంగా ప్రభుత్వం ఏరకంగా పాలన చేసిందీ..పార్టీలో నిర్ణయాలు..ఎన్నికల కార్యాచరణ గురించి ముఖ్యమంత్రి పార్టీ కేడర్ కు వివరించనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ముఖ్యమంత్రి జగన్ ఈ సమావేశాలు ప్రారంభించనున్నారు. కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయటంతో పాటుగా పార్టీ పరంగా అందరినీ ఐక్యంగా పని చేసేలా సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.

పార్టీ కేడర్ మధ్యకు జగన్ : రోజుకు రెండు జిల్లాల చొప్పున ముఖ్యమంత్రి కేడర్ మీటింగ్స్ నిర్వహించేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అభ్యర్దుల ఎంపిక వెనుక కారణాలు వివరించి గెలుపు బాధ్యత తీసుకోవాలని సూచించనున్నారు. సిట్టింగ్ లను మార్చిన నియోజకవర్గాల్లో సీట్లు కోల్పోయిన వారికి భవిష్యత్ లో ఇచ్చే ప్రాధాన్యత ఈ సమావేశాల్లోనే జగన్ కార్యకర్తల సమక్షంలో వెల్లడించనున్నారని చెబుతున్నారు. ఇక..కొత్త మేనిఫెస్టోల రూపకల్పన పైన జగన్ ఈ నెలాఖరులోగా కమిటీ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. 209 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో 96 శాతం హామీలను అమలు చేసిన విషయాన్ని వివరిస్తూనే..వచ్చే ఎన్నికల హామీలు..మేనిఫెస్టోల పైన నిర్ణయం చేయనున్నారు.

ఇక ఎన్నికల ప్రచారం : ఇక, ప్రతిపక్షాలు పొత్తులు, సీట్ల లెక్కల వేళ ఆ పార్టీల్లో మరింత గందరగోళం ఏర్పడుతుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. జగన్ ఈ సారి సీట్ల ఖరారులో అమలు చేస్తున్న సామాజిక న్యాయం.. అమలు చేసిన సంక్షేమం తమకు కలిసి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తనకు వ్యతిరేకంగా అందరూ ఏకమై ఎన్నికల బరిలోకి దిగుతున్న సమయంలో..జగన్ ప్రచారంతో ఎలాంటి సరళితో ముందకు వెళ్తారు.. ప్రతిపక్షాలను టార్గెట్ చేసేందుకు ఏ అస్త్రాలను ప్రయోగిస్తారానేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications