జగన్ మార్క్ "బిజినెస్" - ఎన్నికల వేళ గేమ్ ఛేంజర్: ప్రతిపక్షాలు సైలెన్స్..!!
ప్రతిపక్షాలకు..తన పై విమర్శలకు జగన్ ఒక్క సదస్సుతో సమాధానం ఇచ్చారు.
జగన్ కు అభివృద్ధి తెలియదు. జగన్ పాలనలో పెట్టుబడులు రావు. ఇది నిత్యం ప్రతిపక్షాలు చేసే విమర్శలు. వీటన్నింటికీ ఒకే ఒక్క సదస్సుతో సమాధానం. మూడు నెలల సైలెంట్ ఆపరేషన్ ఫలితం. రెండో రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు తరలి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు. రెండు లక్షల కోట్లు పెట్టుబడులు లక్ష్యంగా నిర్ణయిస్తే..ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులు. ప్రకటనలు కాదు...నేరుగా ఎంఓయూలు. విశాఖ కేంద్రంగా ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి జగన్ షాక్ ఇచ్చారు. తన మార్క్ బిజినెస్ ఏంటో నిరూపించారు. ఇప్పుడు ఇదే ఏపీలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది.

సీఎం జగన్ మార్క్ ఆపరేషన్
ఏపీలో పెట్టుబడుల సదస్సు పై అనేక విమర్శలు వచ్చాయి. సీఎం జగన్ పాలన గురించి తెలిసిన వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టరని ఆరోపించారు. ఈ నాలుగేళ్ల పాలన అంతా సంక్షేమం చుట్టూనే తిరిగింది..అభివృద్ధి పైన అవగాహణ లేదంటూ విమర్శించారు. ఇప్పుడు వీటికి అన్నింటికి విశాఖ కేంద్రంగా సీఎం జగన్ సమాధానం ఇచ్చారు. జగన్ ఆహ్వానంతో పారిశ్రామిక దిగ్గజాలు విశాఖకు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి మూడు నెలల కాలంగా బిజినెస్ హౌస్ లతో నేరుగా మానిటర్ చేసారు. ఏపీలో పెట్టుబడల పై చర్చించారు. వారిని ఒప్పించారు. వారితో ఎంఓయూలకు సిద్దం చేసారు. ఆ తరువాత పారిశ్రామిక వేత్త ల నుంచి కమిట్ మెంట్ వచ్చిన తరువాత అన్నింటినీ క్రోడీకరించి ఎంఓయూలకు సిద్దం చేసారు. అన్నీ కలిసి రూ 13 లక్షల కోట్లు ఏపీకి పెట్టబడులు వచ్చినట్లు ముఖ్యమంత్రి ప్రకటనతో ప్రతిపక్షాలు ఆత్మరక్షణ లో పడ్డాయి. అంబానీ, ఆదానీ వంటి ప్రముఖుల సమక్షంలోనే సీఎం జగన్ ఈ ప్రకటన చేసారు.

జే అంటే జగన్ - జే అంటే జోష్
పారిశ్రామిక వేత్తలు జగన్ పాలన అంటే భయపడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. కానీ, విశాఖ కేంద్రంగా జరిగిన సదస్సులో పారిశ్రామిక వేత్తలే స్వయంగా సీఎం జగన్ ను ప్రశంసించారు. జే అంటే జగన్.. జే అంటే జోష్ అంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త తన ప్రసంగంలో ప్రశంసించారు. ముఖేష్ అంబానీ సైతం కేంద్రంలో మోదీ.. ఏపీలో జగన్ పాలన పైన ప్రశంసలు కురిపించారు. ఎన్నికలకు సిద్దం అవతున్న వేళ ముఖ్యమంత్రి జగన్ ఈ సదస్సును వ్యక్తిగతంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నేరుగా ఆయనే రంగంలోకి దిగారు. 20 రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు ఉన్న సానుకూల వాతావరణం గురించి వివరించారు. తొలి రోజున రూ 11.87 లక్షల కోట్ల మేర 92 ఎంఓయూలు జరిగాయి. రెండో రోజుల రూ 1.15 లక్షల కోట్ల విలువైన 248 ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అందుతుందని ప్రభుత్వం చెబుతోంది.












Click it and Unblock the Notifications