బీజేపీ మద్దతుపై తేల్చేసిన సీఎం జగన్, పొత్తులు క్లియర్ - యుద్దం ఆరంభం..!!

ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు దత్తపుత్రుడు అండ లేదు..ఒక బీజేపీ అండగా ఉండకపోవచ్చు..తాను వీళ్లను నమ్ముకోలేదని..కేవలం దేవుడి దయ..ప్రజల చల్లని ఆశీస్సులనే తాను నమ్ముకున్నానని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. జరిగే కురుక్షేత్ర సంగ్రామంలో పెత్తందార్లకు..పేదల పార్టీకి మధ్య యుద్దం జరుగుతోందని విశ్లేషించారు. తన ధైర్యం..ఆత్మవిశ్వాసం మీరేనంటూ జగన్ చెప్పుకొచ్చారు. సీఎం జగన్ వ్యాఖ్యలతో ఒక్క సారిగా ఏపీ రాజకీయం లో కొత్త సమీకరణలు తెర మీదకు వచ్చాయి.

బీజేపీ మద్దతు లేదు:ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏం జరుగుతోందనేతి క్లారిటీ ఇచ్చేసారు. పల్నాడు జిల్లా క్రోసూరులో ముఖ్యమంత్రి జగన్ విద్యా కానును ప్రారంభించారు. ఈ సమయంలో ఏపీలో ప్రతిపక్షాల తీరు పైన మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా ఫైర్ అయ్యారు. ఏపీలో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా..కేంద్ర హోం మంత్రి అమిత్ షా వైసీపీ ప్రభుత్వం పైన తీవ్ర ఆరోపణలు చేసారు.

CM Jagan Clarified on BJP support in Next Elections, launch Vidya Kanuka at Palnadu dist

ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పరోక్షంగా వారి తీరును స్పష్టం చేసారు. తనకు బీజేపీ అండగా ఉండకపోవచ్చని తేల్చి చెప్పారు. తాను వీళ్లను ఎవరినీ నమ్ముకోలేదని ప్రకటించారు. పేదలకు మంచి చేస్తుంటే తట్టుకోలేని మనస్తత్వం చంద్రబాబుదేనని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఏం చేసిన మద్దతు పలికే దత్తపుత్రుడు ఉన్నాడంటూ వ్యాఖ్యానించారు.

నా నమ్మకం..ఆత్మవిశ్వాసం ఒక్కటే:టీడీపీ తీసుకొచ్చిన మేనిఫెస్టో పైన ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. పొరుగు రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను బిస్బిల్లా బాత్ చేసి ఇక్కడ ప్రకటిస్తున్నారని ఎద్దేవా చేసారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారి మేనిఫెస్టోల్లో చేర్చుతున్నారని దుయ్యబట్టారు.

వచ్చే ఎన్నికలు పేదలకు..పెత్తందార్లకు మధ్య జరిగే ఎన్నికలుగా ముఖ్యమంత్రి జగన్ అభివర్ణించారు. నాలుగేళ్ల కాలంలో 2.16 లక్షల కోట్ల విలువైన సంక్షేమం ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా అందించామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో స్కాంలు ఉంటే..తన ప్రభుత్వంలో స్కీంలు అమలు చేసామని వివరించారు. చంద్రబాబు అంటే వెన్నుపోటు అని..చెప్పిన ఏ మాట నిలబెట్టుకున్న అలవాటు లేదని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికలు కురుక్షేత్ర సంగ్రామంగా ముఖ్యమంత్రి వివరించారు.

వారి అండ అవసరం లేదు:ఈ సంగ్రామంలో తనకు దుష్ణచతుష్టం అండ అవసరం లేదన్నారు. బీజేపీ మద్దతు అక్కర్లేదన్నారు. తనకు ప్రజల మద్దతు ఉంటే చాలని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. పాఠశాలలు మొదలైన రోజునే విద్యా కానుక అందిస్తున్నామన్నారు. ప్రతీ విద్యార్ధికి అందించే కిట్లలో మార్పులు తీసుకొచ్చామని వివరించారు. ఈ ఒక్క పధకం మీదే ఈ నాలుగేళ్ల కాంలో రూ 3,366 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.ఇప్పుడు బీసీ, ఎస్సీ ల సబ్ ప్లాన్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు 14 ఏళ్లు ఏం చేసారని సీఎం జగన్ ప్రశ్నించారు. ఎన్నికల ముందు వాగ్దానం..తరువాత మోసం చంద్రబాబు నైజం అని ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. ఇప్పుడు సీఎం జగన్ వ్యాఖ్యలతో ఏపీలో వచ్చే ఎన్నికల సంగ్రామం లో ఎవరెటు అనేది దాదాపుగా స్ఫష్టత వచ్చేసింది. ఇప్పుడు అసలు యుద్దం మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+