అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్మార్ట్ పోలీసింగ్ లో ఏపీ టాప్-పోలీసు బాస్ లకు జగన్ అభినందనలు

|
Google Oneindia TeluguNews

ఇండియన్ పోలీసు ఫౌండేషన్ తాజాగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఏపీ పోలీసులు టాప్ లో నిలిచారు. వివిధ విభాగాల్లో పోలీసులు అందిస్తున్న సేవల్ని పరిగణనలోకి తీసుకున్న ఫౌండేషన్ ఈ ర్యాంకులు ఇచ్చింది. ఇందులో ఏపీ పోలీసులు టాప్ లో నిలవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

జాతీయ స్ధాయిలో ఘనతను చాటిన పోలీస్‌ శాఖను సీఎం వైఎస్‌ జగన్‌ ఇవాళ అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించడంలో భారతదేశంలో అగ్రగామిగా నిలిచిన ఏపీ పోలీస్‌ శాఖను మనస్పూర్తిగా అభినందిస్తున్నట్లు సచివాలయంలో తనను కలిసి నపోలీసు ఉన్నతాధికారులకు సీఎం జగన్ తెలిపారు. ఇదే రీతిలో ప్రజలకు మరిన్ని సేవలను నిర్ణీత సమయంలో అందించి ఈ ప్రస్ధానాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

cm jagan congratulate AP Police for being number one in smart policing in the country

డీజీపీ గౌతమ్‌ సవాంగ్ ఆధ్వర్యంలో సీఎం జగన్ ను కలిసిన పోలీస్‌ ఉన్నతాధికారులు స్మార్ట్‌ పోలీసింగ్‌ సర్వే రిపోర్ట్‌ను ఆయనకు అందజేశారు. అనంతరం డీజీపీ వివరాలు వెల్లడించారు. స్మార్ట్‌ పోలీసింగ్‌లో ఏపీకి నెంబర్‌ వన్‌ ర్యాంక్ ఇస్తున్నట్లు
ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌ సర్వే వెల్లడించింది. స్మార్ట్‌ పోలీసింగ్‌పై ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సర్వే నిర్వహించారు. తొమ్మిది ప్రామాణిక అంశాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ విధానాలలో ఈ సర్వే నిర్వహించారు.

2014లో జరిగిన డీజీపీల సదస్సులో స్మార్ట్‌ పోలీసింగ్‌ పద్దతులను పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. అనంతరం ప్రధాని పిలుపుకు స్పందించి స్మార్ట్‌ పోలీసింగ్‌ నిర్వహిస్తున్న రాష్ట్రాలపై ఇండియన్‌ పోలీస్‌ ఫౌండేషన్‌ సర్వే నిర్వహించింది. ఏడేళ్ళుగా నిర్వహిస్తున్న సర్వేలో ఏపీ పోలీస్‌ శాఖ తొలిసారిగా మొదటి ర్యాంకును సాధించింది. ప్రజల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఐపీఎఫ్ ఈ సర్వే నిర్వహించింది. ఐపిఎఫ్‌లో సభ్యులుగా రిటైర్డ్‌ డీజీలు, ఐపీఎస్‌లు, ఐఏఎస్‌లు, ఐఐటీ ప్రొఫెసర్లు, పౌర సమాజానికి సంబంధించిన ప్రముఖులు ఉన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్, నిష్పక్షపాత, చట్టబద్ద, పారదర్శక పోలీసింగ్, జవాబుదారీతనం, ప్రజల నమ్మకం విభాగాల్లో ఏపీ నెంబర్‌ వన్ గా నిలిచింది.
పోలీస్‌ సెన్సిటివిటీ, పోలీసుల ప్రవర్తన, అందుబాటులో పోలీస్‌ వ్యవస్ధ, పోలీసుల స్పందన, టెక్నాలజీ ఉపయోగం విభాగాలలో కూడా అత్యుత్తమ ర్యాంకింగ్‌ సాధించింది.

cm jagan congratulate AP Police for being number one in smart policing in the country

సీఎం జగన్ ను కలిసిన వారిలో డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌తో పాటు లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్, అడిషనల్‌ డీజీ (బెటాలియన్స్‌) శంకబ్రత బాగ్చి, డీఐజీ (టెక్నికల్‌ సర్వీసెస్‌) పాలరాజు, గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ ఉన్నారు.

English summary
ap cm ys jagan on today congratulates police department for being number one in smart policing in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X