ప్రశాంత్ కిషోర్‌కు సీఎం జగన్ అదిరిపోయే కౌంటర్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. చెదురుమొదురు ఘటనలు మినహా సోమవారం నాడు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గత నెల రోజులుగా రాజకీయ పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం విసృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేతల జాతకం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తం అయ్యాయి. గెలుపుపై ఇరు వర్గాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఏపీలో దాదాపు 81 శాతం ఓటింగ్ జరిగింది.
2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువే. గత ఎన్నికల్లో 79.8 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో అని నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. వై నాట్ 175 అనే నినాదాన్ని వినిపిస్తూ, అన్ని స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలుస్తారని ధీమాను మొదటి నుంచి జగన్ వ్యక్తం చేస్తూనే వస్తున్నారు. తాజాగా ఆయన ఐప్యాక్ టీంతో భేటీ అయ్యారు.పోలింగ్ సరళి గురించి ఐప్యాక్ టీంతో సీఎం జగన్ చర్చించారు.

ఈ సమయంలో జగన్ మాట్లాడుతూ.. కచ్చింతగా మనమే అధికారంలోకి వస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మరోసారి భారీ మెజార్టీతో వైసీపీ ఘన విజయం సాధించబోతోందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌కు జగన్‌కు కౌంటరిచ్చారు. ప్రశాంత్ కిశోర్ కూడా ఊహించలేనన్ని సీట్లు సాధించబోతున్నట్లు సీఎం జగన్ తెలిపారు. రాబోయే ప్రభుత్వం గతంలో మరింత మంచి చేసేందుకు కార్యచరణ రూపొందించినట్లు వెల్లడించారు. 22 ఎంపీ సీట్లు గెలుస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
2019 లో చూసిన విజయానికి కంటే మరింత భారీ విజయం(151 సీట్లు) సాధించబోతున్నామని అన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని అన్నారు. ఏపీ ఫలితాలపై ఇటీవల ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్త పరిచారు. గడిచిన ఐదేళ్లలో జగన్ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.












Click it and Unblock the Notifications