సీఎం జగన్ లాస్ట్ వార్నింగ్ - ఆ ఎమ్మెల్యేలకు టెన్షన్ : రేపే కీలక భేటీ..!!

ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్న సీఎం జగన్ కీలక భేటీకి నిర్ణయించారు. ఇప్పటికే ప్లీనరీ ద్వారా తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారులే తన సైన్యంగా జగన్ చెప్పుకొచ్చారు. పథకాల తీరు పైన ప్రతీ ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లాలని మూడు నెలల క్రితం సీఎం నిర్దేశించారు. ఇప్పటికే కార్యక్రమం ప్రారంభం ముందు.. ఆ తరువాత సీఎం ఎమ్మెల్యేలకు వస్తున్న స్పందన.. ఎమ్మెల్యేల బాధ్యత నిర్వహణ పైన సమీక్ష చేసారు. కీలక సూచనలు చేసారు. పరోక్షంగా హెచ్చరికలు చేసారు. ఈ కార్యక్రమం ఎనిమిది నెలలు ఉంటుందని.. గ్రాఫ్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలు తమ పని తీరు మెరుగు పరుచుకోకుంటే టిక్కెట్ల విషయంలో మరో ఆలోచన చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసారు.

కొందరు ఎమ్మెల్యే తీరుపై అసహనం

కొందరు ఎమ్మెల్యే తీరుపై అసహనం

ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లే విధంగా పాదయాత్రు..బస్సు యాత్రలు డిసైడ్ చేసిన క్రమంలో మరింతగా ఎమ్మెల్యేలను ప్రజలతో మమేకం అయ్యే విధంగా సీఎం కార్యచరణ కట్టుదిట్టం చేస్తున్నారు. అందులో భాగంగా రేపు (సోమవారం) పార్టీకి చెందిన ఎంపీలు..ఎమ్మెల్యేలు అందరూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వినియోగించుకొనేందుకు అమరావతి రానున్నారు. ఓటింగ్ పూర్తయిన తరువాత సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి జగన్ తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో వర్క్ షాప్ కు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు..గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న తీరు పైన సర్వేల ద్వారా పూర్తి సమాచారం సేకరించారు.

ఇక సీరియస్ వార్నింగ్ లతో

ఇక సీరియస్ వార్నింగ్ లతో


ఆ నివేదికల ఆధారంగా సీఎం జగన్ ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేయనున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నా.. కొందరు మినహా మిగిలిన నేతలు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తుండటం పైన సీఎం సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది. దీంతో పాటుగా పని తీరు పరంగా వెనుక బడి ఉన్న ఎమ్మెల్యేలకు ఒకింత సీరియస్ గానే ఈ సారి హెచ్చరికలు చేసే అవకాశం కనిపిస్తోంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేలు హాజరు, ప్రజల స్పందన, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కారాల శాతం అన్నింటి పైనా చర్చించనున్నారు. అదే విధంగా నియోజవకర్గాల్లో పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సీఎం జగన్ ఇప్పటికే నిధుల కేటాయింపు పైన హామీ ఇచ్చారు.

ఎన్నికల వేళ జగన్ కొత్త నిర్ణయాలు

ఎన్నికల వేళ జగన్ కొత్త నిర్ణయాలు


ఆ నిధుల విడుదల.. వినియోగం పైన మరసారి స్పష్టత ఇవ్వనున్నారు. ఇక, ప్రతిపక్షాలు విమర్శలు పెంచుతున్న సమయంలో.. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల పరిష్కార బాధ్యత ఎమ్మెల్యేలకు అప్పగించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు తమ సమస్యలను నేరుగా సీఎంఓకు చేర వేసేందుకు ఒక వాట్సప్ నెంబర్ అందుబాటులో ఉంచారు. ఇక నుంచి ప్రజా దర్బార్ నిర్వహించాలని సీఎం భావిస్తున్న వేళ.. నియోజకవర్గాల వారీగా సమీక్షలు సైతం ప్రారంభించే అవకాశం ఉంది. దీని పైన సోమవారం సమావేశంలో సీఎం క్లారిటీ ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+