వైసీపీలో సీనియర్ నేత వారసుడికి టికెట్ ఖరారు..!!
వైసీపీలో వారసులకు టికెట్లు దక్కుతాయా లేదా. కొంత కాలంగా పార్టీలో ఈ చర్చ సాగుతోంది. సీఎం జగన్ నిర్ణయం కోసం సీనియర్లు నిరీక్షిస్తున్నారు. పార్టీ నేతలతో సమీక్షలో భాగంగా సీనియర్లకు టికెట్ అంశం లో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ఈ చర్చ మొదలైంది.
ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ మరోసారి ఈ వ్యవహారం తెర పైకి వచ్చింది. ఈ నెల 3న పార్టీ నేతలతో జరిగే సమీక్షలో ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాల పైన సీఎం జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత వారసుడికి టికెట్ ఖరారు అయింది.
కుమారుడికి సీటు కోసం చెవిరెడ్డి
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. తన స్థానంలో తన కుమారుడు మోహిత్ రెడ్డికి సీటు ఇవ్వాలని సీఎం జగన్ ను కోరారు. ముఖ్యమంత్రిని ఒప్పించేందుకు చెవిరెడ్డి చాలా ప్రయత్నాలు చేసారు. సీఎం జగన్ దగ్గర చెవిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తొలి నుంచి వైఎస్ కుటుంబానికి విధేయుడిగా..జగన్ పార్టీ ఏర్పాటు సమయం నుంచి కొనసాగుతున్నారు.
ఎమ్మెల్యేలను నామినేటెడ్ పదవుల నుంచి తప్పించినా చెవిరెడ్డికి మాత్రం మినహాయింపు దక్కింది. చెవిరెడ్డి తుడా ఛైర్మన్ హోదాలో టీటీడీ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉన్నారు. సీఎం జగన్ నివాసంలో జరిగే పర్వదినాల్లో చెవిరెడ్డి బాధ్యతలు తీసుకుంటారు.

పార్టీలో యాక్టివ్ గా మోహిత్ రెడ్డి..
చంద్రగిరికి లో ఎమ్మెల్యే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి క్రియాశీలకంగా మారారు. మోహిత్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి రూరల్ ఎంపీపీ గా కొనసాగుతున్నారు. నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. తన కుమారుడికి సీటుకు సంబంధించి సీఎం జగన్ నుంచి చెవిరెడ్డి హామీ పొందారని ఇప్పటికే ప్రచారం. దీనికి సంబంధించి నియోజకవర్గాల్లో అనుచరులు సంబరాలు చేసుకున్నారు.
చెవిరెడ్డి ఎన్నికల్లో పార్టీ వ్యవహారాలకే పరిమితం అవుతారని తెలుస్తోంది. ఎన్నికల వేళ పార్టీ సీనియర్లలో కొందరిని పోటీ నుంచి తప్పించి ఎన్నికల బాధ్యతలు అప్పగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఎలక్షన్ బాధ్యతలు అప్పగిస్తారని కొంత కాలగా ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో ఈ వ్యవహారానికి సంబంధించి చెవిరెడ్డి కీలక ప్రకటన చేసారు.
చంద్రగిరి బరిలో చెవిరెడ్డి వారసుడు..
ఈ వ్యవహారానికి సంబంధించి ఎమ్మెల్యే చెవిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి అభ్యర్ధిగా తన కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్న నేపథ్యంతో తాను సీఎం జగన్ వెంట నడవాల్సి ఉందని చెప్పారు.
చంద్రగిరిలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు అవకాశం ఉండేలా మోహిత్ రెడ్డిని అభ్యర్దిగా పంపాలని సీఎం జగన్ సూచించారని వెల్లడించారు. తనను ఆదరించినట్లగానే తన కుమారుడిని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి కోరారు. దీంతో, ఇప్పుడు మిగిలిన నేతల వారసులకు టికెట్ల అంశం పైన మరోసారి ఆసక్తి కర చర్చ మొదలైంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications