సీఎం జగన్ ఇష్టంగా ఏం తింటారో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం విధినిర్వహణలో తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. సాధారణంగా అందరూ పనిఒత్తిడి లోనైనప్పుడు ఎక్కువ ఆహారం తీసుకుంటుంటారు. దీనివల్ల ఊబకాయం వస్తుంది. కానీ ముఖ్యమంత్రిగా అంతటి ఒత్తిడిలోను కచ్చితంగా డైట్ ను జగన్ ఫాలో అవుతారు. మొదటి నుంచి ఆయన మంచి ఆరోగ్యంగా ఉండేందుకే ప్రాధాన్యతనిస్తారు. అందుకు తగ్గట్లుగా ఆహారం తీసుకుంటారని చాలామందికి తెలియదు. మామిడికాయ తురిమి చేసే పులిహోర అంటే జగన్‌కు చాలా ఇష్టం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంతకుముందు ఓదార్పు యాత్ర చేసే సమయంలో కూడా ఎప్పుడు విజయవాడ వచ్చినా కచ్చితంగా ఆయన భోజనంలో మామిడికాయ పులిహోర ఉండాలి.

తర్వాత పప్పును, నాన్‌వెజ్‌ను, ఊరగాయ పచ్చడిని ఇష్టంగా తీసుకుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మితాహారం తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా ఇంట్లో వంట చేసేందుకు మనిషి ఉన్నారు. వారు కాకుండా బయట నుంచి స్నేహితులు పలువురు జగన్ కు ఇష్టమైనవి చేయించుకొని క్యారేజీలు పంపించేవారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత బయట తినడం తగ్గించారు. కానీ కొందరు ముఖ్యమైనవారు మాత్రం వారి వారి ఇళ్ల దగ్గర నుంచి బయలుదేరినప్పుడు జగన్ కు ఇష్టమైన ఆహార పదార్థాలను ప్రత్యేకంగా ప్యాక్ చేయించుకొని తెస్తారు. ఏ ఒక్కరినీ నిరాశపరచకుండా కచ్చితంగా వాటన్నింటినీ స్వీకరించడమే కాకుండా వారిముందే తినేవారు.. వారిని ఆనందపరిచేవారు. అదే ఆయన గొప్పతనం.












Click it and Unblock the Notifications