సాయిరెడ్డి స్థానంలో వైవీ : కొడాలి నాని -మిథున్ రెడ్డి బాధ్యతల ఖరారు : సీఎం జగన్ కసరత్తు- మార్పులు..!!
వైసీపీ లో భారీ మార్పుల దిశగా భారీ కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వంలో కేబినెట్ ప్రక్షాళన పూర్తి చేసిన జగన్..ఇప్పుడు పార్టీ వ్యవహారాల పైన ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా.. మంత్రి పదవులు కోల్పోయిన సీనియర్లకు పార్టీ బాధ్యలు అప్పగిస్తానని సీఎం ఇప్పటికే చెప్పారు. గత కేబినెట్ లో మంత్రులుగా పని చేసిన వారిలో 11 మందికి సీఎం జగన్ తిరిగి అవకాశం ఇచ్చారు. కొత్తగా 14 మందికి ఛాన్స్ దక్కింది. ఇక, మంత్రి పదవులు దక్కని వారికి నామినేటెడ్ హోదాలో జిల్లా స్థాయిలో డీడీఏ ఛైర్మన్ గా పదవులు కట్టబెట్టే ప్రతిపాదన పైనా కసరత్తు జరిగింది. ఇక, ప్రాంతీయ - జిల్లా బోర్డుల ఏర్పాటు పైన కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది.

సీనియర్లకు పార్టీ బాధ్యతలు.. జిల్లాల వారీగా
అందులో భాగంగా.. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత..ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయ సాయి రెడ్డిని ఉత్తరాంధ్ర భాధ్యతల నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆయనకు ఇప్పటికే పార్టీ అనుబంధ విభాగాల బాధ్యతలకు పరిమితం చేసారు. రాష్ట్ర స్థాయిలో మొత్తం పార్టీ కార్యకలాపాలను కూడా సమన్వయం చేస్తారు ఇప్పటి వరకు, సాయి రెడ్డి న్యూఢిల్లీలో అనుసంధానం చేయడంతో సహా పార్టీలో, ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే, గతం కంటే భిన్నంగా విజయ సాయిరెడ్డి జోక్యం కొన్ని అంశాలకే పరిమితం అయినట్లు కనిపిస్తోంద. ఇక, సాయిరెడ్డి స్థానంలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి కి ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది. సీనియర్ మంత్రి బొత్సా - పార్టీ నుంచి సుబ్బారెడ్డి ఇక నుంచి ఉత్తరాంధ్ర బాధ్యతలు నిర్వహిస్తారని పార్టీలో చర్చ సాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతలను పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డికి అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

టీడీపీ ప్రభావిత జిల్లాల్లో కొడాలి నాని
ఇక, ఫైర్ బ్రాండ్ మంత్రిగా గత కేబినెట్ లో వ్యవహరించి.. విస్తరణ లో పదవి కోల్పోయిన కొడాలి నానికి కృష్ణా- గుంటూరు జిల్లాల్లో పార్టీ బాధ్యతలను అప్పగించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఆ రెండు జిల్లాల్లో కొడాలి నాని సామాజిక వర్గ ప్రభావం ఉండటం.. ఆ వర్గం టీడీపీకి మద్దతుగా నిలుస్తుందనే వాదన నడుమ నానికి అక్కడ బాధ్యతలు కేటాయించాలని నిర్ణయించారు. మంత్రి పదవి మిస్ అయిన మరో సీనియర్ నే బాలినేనికి ప్రకాశం- నెల్లూరు జిల్లాల బాధ్యతలు ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డికి కర్నూలు - అనంతపురం జిల్లాల బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, కొద్ది రోజుల క్రితం వరకూ విశాఖ బాధ్యతలను సాయిరెడ్డి స్థానంలో వేమిరెడ్డి ప్రభాకర రెడ్డికి ఇస్తారనే ప్రచారం సాగింది.

ప్రాంతీయ - జిల్లాల వారీగా బాధ్యతలు
ఇక, ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత జిల్లా బాధ్యతలను పూర్తిగా సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరిందరికి పార్టీ బాధ్యతలను ఒకటి రెండు రోజుల్లోనే అధికారికంగా అప్పగించే అవకాశం కనిపిస్తోంది. ఇక..పేర్ని నాని..కన్నబాబు.. అవంతి శ్రీనివాస్.. పుష్ఫ శ్రీ వాణీ..అనిల్ కుమార్ యాదవ్ కు సైతం పార్టీలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో..పార్టీ పరంగా మరిన్ని మార్పులు తప్పవని చెబుతున్నారు. దీంత..పార్టీ పరంగా జగన్ తీసుకొనే నిర్ణయాల పైన ఉత్కంఠ నెలకొని ఉంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications