టికెట్ల "సర్దుబాటు" లో జగన్ మార్క్ డెసిషన్ - అవకాశం వీరికేనా..!?

ముఖ్యమంత్రి జగన్ వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికలకు అభ్యర్ధుల ఎంపిక ప్రారంభించారు. 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎవరికి సీట్లు దక్కుతాయనే చర్చ ఇప్పుడు వైసీపీ లో ఉత్కంఠ పెంచుతోంది. గడప గడపకు ప్రభుత్వం పైన నిర్వహించిన వర్క్ షాప్ లో 28 మంది ఎమ్మెల్యేలకు సీఎం గజన్ డెడ్ లైన్ విధించారు. ఇదే సమయంలో పలు నియోజకవర్గాల్లో నేతలు..టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి మద్దతుగా నిలిచిన వారి నియోజకవర్గాల్లోనూ టికెట్ కోసం పోటీ నెలకొంది. దీంతో..జగన్ ముందస్తు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ సీట్లు కేటాయింపు పైన కసరత్తు ప్రారంభించారు. మొత్తం 21 మంది ఎంపిక దిశగా అడుగులు పడుతున్నాయి.

21 మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం..

21 మందికి ఎమ్మెల్సీలుగా అవకాశం..

ఈ ఏడాది మార్చి 29 నుంచి మే 1 వరకు శాసన మండలిలో మొత్తం 21 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ స్థానాలు మొత్తం వైసీపీకే దక్కటం ఖాయంగా కనిపిస్తోంది. అందులో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న వైసీపీకి చెందిన అయిదుగురు..టీడీపీ చెందిన ఇద్దరు ఉన్నారు. ఈ ఏడు స్థానాలు వైసీపీకే దక్కనున్నాయి. అదే విధంగా స్థానిక సంస్థల కోటాలో 9 స్థానాలు టీడీపీ నుంచి ఖాళీ కానున్నాయి. టీడీపీ నుంచి రిటైర్ అవుతున్న వారిలో నారా లోకేష్ కూడా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల నుంచి ఎంపిక చేసిన నేతలతో ఖాళీలు భర్తీ చేసేలా వైసీపీ నాయకత్వం వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందే ఎమ్మెల్యే సీట్లు ఖరారు చేస్తానని గతంలోనే సీఎం జగన్ ప్రకటించారు. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయి నివేదికలు..సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.

సర్దుబాట్లు - మండలికి అభ్యర్ధులు

సర్దుబాట్లు - మండలికి అభ్యర్ధులు

గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం నియోజకవర్గ ఇంఛార్జ్ లుగా ఉన్న వారికి ఎమ్మెల్యేలుగా గా అవకాశం ఇచ్చి.. పార్టీకి ఇప్పటి వరకు సేవలు అందించిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా విజయవాడ తూర్పు లో దేవినేని అవినాశ్ కు టికెట్ ఖరారు కావటంతో, అక్కడ నుంచి బొప్పన భవ కుమార్కు..మండపేట నుంచి పట్టాభిరామయ్య చౌదరి.. పర్చూరు నుంచి రావి రామనాధం కు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. మండపేటలో తోట త్రిమూర్తులు, పర్చూరులో ఆమంచికి ఇప్పటికే సీఎం బాధ్యతలు అప్పగించారు అదే విధంగా చాలా కాలంగా మర్రి రాజశేఖర్, మేకా శేషుబాబు, జంకె వెంకటరెడ్డి వంటి నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కుతుందని పార్టీలో ప్రచారం సాగుతోంది. వీరితో పాటుగా ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న వారిలో కొందరిని కొనసాగించటం.. మరి కొందరిని మర్చే అంశం పైక కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

రేసులో సీనియర్లు - ఛాన్స్ దక్కేదెవరికి

రేసులో సీనియర్లు - ఛాన్స్ దక్కేదెవరికి


వైసీపీ నుంచి శాసనమండలికి ఈ సారి చాలా మంది రేసులో ఉన్నారు. ప్రస్తుతం సభ్యులుగా ఉన్న వారిలో డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, గంగుల ప్రభాకర్ రెడ్డి, సూర్యనారాయణ రాజు పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. వీరిలో సామాజిక - ప్రాంతీయ సమీకరణాల్లో భాగంగా డొక్కా, పోతుల సునీతను కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. చల్లా భగీరధరెడ్డి మరణంతో ఆయన సతీమణి లక్ష్మీకి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. అక్కడ వంశీ రాకను వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతుల యార్లగడ్డ వెంకరావు, దుట్టా రామచంద్రరావుల్లో ఒకిరికి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా..హిందూపురం వైసీపీ సీనియర్ నేతకు ఈ సారి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. దీంతో, ఎమ్మెల్యే అభ్యర్ధుల కంటే ముందుగానే ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక జరగనుండటంతో సీఎం జగన్ ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+