జగన్ గెలుపు గుర్రాలు సిద్దం - ఆ సీనియర్లకు షాక్, భారీ మార్పులు..!!
వచ్చే ఎన్నికలను సీఎం జగన్ కురుక్షేత్ర మహాసంగ్రామంగా భావిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎవరెవరు కలిసినా..తాను ఒంటరిగానే పోటీకి దిగుతానని ప్రకటించారు. వై నాట్ 175 అంటూ నినదించారు. ప్రతీ ఇంటికి మంచి జరిగితేనే తనకు ఓటు వేయమని కోరుతున్నారు. రాష్ట్రంలోని కోటి 10 లక్షల కుటుంబాలకు చేసిన మేలు తనను గెలిపిస్తుందని విశ్వసిస్తున్నారు. ఇక, ఒకే సారి ఎంపీ..ఎమ్మెల్యే అభ్యర్దుల ఖరారు పైన ఫోకస్ చేసారు. గెలుపే ప్రామాణికంగా జగన్ మార్క్ ఎంపిక కొనసాగుతోంది.
గెలుపే ప్రామాణికంగా:ముఖ్యమంత్రి జగన్ ఈ సారి బీసీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సుముచితంగా సీట్లు కేటాయిస్తూ మహిళలకు స్థానాలను పెంచనున్నారు. అదే సమయంలో సామాజిక - ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటూ సర్వే నివేదికల ఆధారంగా గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. సీనియార్టీ..సిన్సియార్టీలతో పాటుగా గెలిచే వారికి మాత్రమే అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా..కొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దింపటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ జాబితాలో మంత్రులు కూడా ఉన్నారు. గుంటూరు, విజయవాడ స్థానాల్లో లోక్ సభ అభ్యర్దుల విషయంలో సీఎం జగన్ భారీ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇక, నర్సరావు పేట నుంచి ఆళ్ల అయోధ్యరామిరెడ్డి పేరు వినిపిస్తోంది. ఒంగోలు నుంచి కరణం బలరాంను బరిలోకి దించాలనేది సీఎం జగన్ ఆలోచన గా సమాచారం.

అవసరమైన మార్పులు:అనంతపురం నుంచి ఎంపీగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఖాయంగా కనిపిస్తోంది. హిందూపురం నుంచి ఎమ్మెల్సీ ఇక్బాల్ నుంచి ఎంపీగా పోటీ చేయించే అంశం పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.హిందూపురం ఎమ్మెల్యేగా టీఎస్ దీపిక పేరు ఖాయమైంది. కర్నూలు ఎంపీగా టీడీపీ సీనియర్ నేత కుటుంబం వైసీపీలోకి వస్తుండటంతో..వారికి కేటాయిస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో బుట్టా రేణుక పేరు పరిశీలనలో ఉంది. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి పేరు ఖాయమైంది. తిరుపతి, కడప, నంద్యాల, రాజంపేట, మచిలీపట్నం ఎంపీల స్థానాల్లో మార్పులు ఉండే అవకాశం లేదు. ఇక, శ్రీకాకుళం నుంచి మంత్రి ధర్మాన, స్పీకర్ తమ్మినేని పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఏలూరు ఎంపీ అభ్యర్ది మార్పు ఖాయమని చెబుతున్నారు. వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో బోళ్ల రాజీవ్ పేరు పరిశీలనలో ఉంది.
ఎమ్మెల్యేలుగా ఎంపీలు:నరసాపురం నుంచి అన్నీ అనుకూలిస్తే సినీ హరో దివంగత క్రిష్ణంరాజు సతీమణి శ్యామలను బరిలోకి దింపేలా ఇప్పటికే మిథున్ రెడ్డి సంప్రదింపులు చేసారని తెలుస్తోంది. శ్యామల ఆసక్తిగా లేకపోతే గోకరాజు రామరాజు పేరు పరిశీలిస్తున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను నిడుదవోలు ఎమ్మెల్యేగా దింపే అవకాశం ఉంది. రాజమండ్రి ఎంపీగా మంత్రి చెల్లుబోయిన వేణు పేరు వినిపిస్తోంది. ఇదే సమయంలో రాజమండ్రి ఎంపీగా మాజీ మంత్రి కురసాల కన్నబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వంగా గీత మరోసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఇదే సమయంలో చలమల శెట్టి సునీల్ రంగంలోకి దిగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. విజయనగరం నుంచి మంత్రి బొత్సా ను బరిలోకి దింపటం పైన చర్చ సాగుతున్నట్లు సమాచారం. అయితే, బొత్స సతీమణికి ఇవ్వటం పైనా చర్చ జరుగుతోంది. అనకాపల్లి ఎంపీగా మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉంది. దీంతో, సీఎం జగన్ కసరత్తు..అభ్యర్దుల ఖరారు పైన వైసీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications