చెప్పారంటే చేస్తారంతే - మరోసారి నిరూపించిన సీఎం జగన్..!!
ముఖ్యమంత్రి జగన్ పైన ఒక నమ్మకం. జగన్ చెప్పారంటే చేస్తారంతే. పార్టీ నేతలు తరచూ చెప్పే అంశం ఇది. ఇప్పుడు జగన్ తాను చెప్పిన మాటను మరోసారి అమలు చేసి నిరూపించారు. ముఖ్యమంత్రి జగన్ నవరత్నాల్లో కీలక పథకం.. మానస పుత్రిక పేదలందరికీ ఇళ్లు - జగనన్న కాలనీలు. అందులో భాగంగా.. జగనన్న గృహ నిర్మాణ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 30.70 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ 30.70 లక్షల ఇళ్లను 17,000 జగనన్న కాలనీల్లో రూ. 55,000 కోట్లు.

మొదటి దశలో ఇప్పటికే 15.60 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రామ సచివాలయాలు, ఆర్‌బికెలు మరియు డిజిటల్ లైబ్రరీలతో పాటు తాగునీరు, డ్రైన్లు, రోడ్లు, విద్యుత్ సరఫరా మరియు ఇంటర్నెట్ వంటి సౌకర్యాల కల్పన కోసం రూ. 32909 కోట్లు ఖర్చు చేస్తున్నారు. జగనన్న ఇళ్ల పట్టాలు పథకం ద్వారా పేద మహిళలకు 30,75,755 ఇళ్ల స్థలాలు, 28.3 లక్షల ఇళ్లను అందించడమే కాకుండా నిర్మాణ రంగంలో లక్షలాది ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. జగన్ చరిత్రలో నిలిచపోయేలా చేసిన 3,648 కిలో మీటర్ల పాదయాత్ర సమయంలో ఎంతో మంది సొంత ఇల్లు లేక పడుతున్న కష్టాలను చూసిన సమయంలో పేదలందరికీ ఇళ్లు నిర్ణయం తీసుకున్నారు.

పేదలకు ఇంటి అద్దె కోసమే పెద్ద మొత్తంలో చెల్లిస్తున్న అంశం అనేక మంది జగన్ తో వాపోయారు. దీంతో, వారి పరిస్థితులు మెరుగుపడాలంటే పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. అది నవరత్నాల్లో ఒకటి గా నిలిచింది. అదే సమయంలో..ఇంటి పట్టా మహిళలకే ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దీనికి కారణాలను సీఎం పలు సభల్లో వివరించారు. పాదయాత్రలో పేదల కష్టం చూసి, సొంత ఇళ్లు కట్టుకోవడం కోసం అప్పుల పాలై.. ఇబ్బందులు పడకుండా పేదలకు సొంత ఇళ్లు కట్టించాలనే దృఢ సంకల్పం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు.

ఇళ్ల పట్టాల ద్వారా కేవలం ఇళ్లు నిర్మించి ఇవ్వటమే కాదు ఎంతో మందికి సమాజంలో ఒక గౌరవ స్ధానాన్ని కల్పించినట్లు అయ్యిందని ముఖ్యమంత్రి వివరించారు. అయితే, ఈ పథకం యొక్క ప్రాథమిక లబ్ధిదారులు మహిళలే. ఈ పథకం వల్ల ఒక్క మహిళ ఇంటి యజమానిగా మారడంతో వారి సామాజిక స్థితిని మెరుగు పర్చుకోగలుగుతారని ముఖ్యమంత్రి చెప్పారు. వారికి పేదరికం నుంచి బయటపడేందుకు సహకరిస్తుందని వివరించారు. పేద కుటుంబాలకు మౌలిక సదుపాయాలను అందిస్తుంది చెప్పిన ముఖ్యమంత్రి త్వరలోనే పూర్తి స్థాయిలో నిర్మాణాల పూర్తికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ నిర్దేశించారు.














Click it and Unblock the Notifications